Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
గణేష్ నవరాత్రి ఉత్సవాలు ప్రశాంత వాతావరణంలో నిర్వహించాలి అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! బీసీ మహిళలకు బంపర్ అవకాశం.. కుట్టు మెషీన్ దరఖాస్తు గడువు పొడిగింపు సెప్టెంబర్ 30వ హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన న్యాల్కల్‌లో శ్రావణ మాసం చివరి సోమవారం.. రామలింగేశ్వర ఆలయంలో భక్తుల రద్దీ అక్షరమే ఆయుధం… గురువే దారిచూపే దీపం! నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి రూ.30 వేల లంచం.. రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడితే ఇంట్లో రూ.4.27 కోట్ల కట్టలు! డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: September 18, 2026 09:04 PM

మనస్తాపంతో వ్యక్తి ఉరివేసుకొని ఆత్మహత్య

మనస్తాపంతో వ్యక్తి ఉరివేసుకొని ఆత్మహత్య

మనస్తాపంతో వ్యక్తి ఉరివేసుకొని ఆత్మహత్య
18-09-2026 115 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
K.RAVI

భార్య మృతి, ఆర్థిక ఇబ్బందులే కారణం

భార్య దూరమవ్వడం, ఆర్థిక ఇబ్బందులు తోడవడంతో తీవ్ర మనస్తాపానికి గురైన ఓ వ్యక్తి ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్న సంఘటన తంగడపల్లి గ్రామంలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... తంగడపల్లికి చెందిన బుంగపట్ల మహేష్ (33, ముదిరాజ్) వృత్తిరీత్యా డ్రైవర్. అతడి భార్య స్వప్న 16 నెలల క్రితం ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకుంది. వీరికి ఒక కుమారుడు, ఒక కుమార్తె కాగా, తల్లి మరణానంతరం ఇద్దరు పిల్లలు అమ్మమ్మ ఇంట్లోనే ఉంటున్నారు.ఇంట్లో ఒంటరిగా ఉంటున్న మహేష్.. భార్యాపిల్లలు దూరమయ్యారనే బాధతోపాటు ఆర్థిక ఇబ్బందులతో తీవ్ర మనస్తాపానికి గురయ్యాడు. ఈ క్రమంలో శుక్రవారం ఉదయం 11:20 గంటల సమయంలో తన నివాసంలో ఉరివేసుకొని ప్రాణాలు విడిచాడు. మృతుడి సోదరుడు మల్లేష్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నట్లు చౌటుప్పల్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ జి. మన్మథ కుమార్ తెలిపారు.

Sthanikam

మనస్తాపంతో వ్యక్తి ఉరివేసుకొని ఆత్మహత్య

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News