మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డికి కృతజ్ఞతలు
కిడ్నీ సంబంధిత వ్యాధితో బాధపడుతున్న బాధితుడికి ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి ఆర్థిక ఊరటనిచ్చారు. మునుగోడు నియోజకవర్గంలోని 18వ వార్డుకు చెందిన పి.ఓంప్రకాశ్ అత్యవసర డయాసిలస్ చికిత్స నిమిత్తం రూ. 1,00,000 (లక్ష రూపాయిల) విలువగల LOC (లెటర్ ఆఫ్ క్రెడిట్) పత్రాన్ని శుక్రవారం నాయకులు అందజేశారు.బాధితుడి అత్యవసర పరిస్థితిని గుర్తించి వెంటనే స్పందించి, ఎల్‌ఓసీ మంజూరు చేయించినందుకు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డికి కుటుంబ సభ్యులు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో పురపాలక వైస్ ఛైర్మన్ గోశిక వినయ్ కుమార్, మున్సిపల్ అధ్యక్షుడు కాసర్ల శ్రీనివాస్ రెడ్డి, కాంగ్రెస్ నాయకులు కామిశెట్టి భాస్కర్, గుగులోతు శంకర్ నాయక్ తదితరులు పాల్గొన్నారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్‌ను పోస్ట్ చేయండి