Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
తంగడపల్లిలో 27న 'ఆసరా' మెగా ఉద్యోగ మేళా అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! బీసీ మహిళలకు బంపర్ అవకాశం.. కుట్టు మెషీన్ దరఖాస్తు గడువు పొడిగింపు సెప్టెంబర్ 30వ హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన న్యాల్కల్‌లో శ్రావణ మాసం చివరి సోమవారం.. రామలింగేశ్వర ఆలయంలో భక్తుల రద్దీ అక్షరమే ఆయుధం… గురువే దారిచూపే దీపం! నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి రూ.30 వేల లంచం.. రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడితే ఇంట్లో రూ.4.27 కోట్ల కట్టలు! డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: September 18, 2026 04:11 PM

రెండో అంతస్తు నుంచి పడి విద్యార్థికి తీవ్రగాయాలు

18-09-2026 59 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Komidala Mahender reddy

నాగార్జునసాగర్ బీసీ గురుకులంలో వరుస ఘటనలపై తల్లిదండ్రుల ఆందోళన.

నాగార్జునసాగర్: బీసీ గురుకుల బాలుర పాఠశాలలో విద్యార్థుల భద్రతపై మరోసారి ఆందోళన వ్యక్తమవుతోంది. హాస్టల్‌ భవనం రెండో అంతస్తు నుంచి ప్రమాదవశాత్తు కిందపడిన ఆరో తరగతి విద్యార్థి నరేందర్‌ తీవ్రంగా గాయపడినట్లు సమాచారం. ప్రమాదంలో గాయపడిన విద్యార్థి కొంతసేపు అపస్మారక స్థితిలోకి వెళ్లినట్లు తెలుస్తోంది. స్థానికంగా ప్రథమ చికిత్స అనంతరం మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్‌కు తరలించినట్లు సమాచారం.ఈ ఘటనతో విద్యార్థుల తల్లిదండ్రుల్లో ఆందోళన నెలకొంది. హాస్టల్‌లో విద్యార్థుల భద్రత, సిబ్బంది పర్యవేక్షణపై వారు ప్రశ్నలు సంధిస్తున్నారు. రెండో అంతస్తు నుంచి విద్యార్థి కిందపడే పరిస్థితి ఎలా ఏర్పడిందనే అంశంపై సమగ్ర విచారణ జరపాలని కోరుతున్నారు.

గతంలోనూ ఘటనలు..!

2025–26 విద్యా సంవత్సరంలోనూ గురుకులంలో పలు ఘటనలు చోటుచేసుకున్నాయని తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. ఆరో తరగతి విద్యార్థి సాత్విక్‌ యాదవ్‌ కడుపునొప్పిగా ఉందని సిబ్బంది, ప్రిన్సిపాల్‌కు తెలిపినా సకాలంలో స్పందించలేదని వారు పేర్కొన్నారు. అనంతరం పేగు సంబంధిత సమస్యతో సాత్విక్‌ మృతి చెందినట్లు సమాచారం.

అలాగే మరో విద్యార్థి సాయిగణేష్‌తో బరువైన బల్లలు, ఇతర వస్తువులు ఎత్తించడంతో ఆరోగ్య సమస్యలు తలెత్తాయని ఆరోపణలు ఉన్నాయి. ఆ విద్యార్థికి ప్రిన్సిపాల్‌ సొంత ఖర్చులతో చికిత్స చేయించినట్లు సమాచారం.

గత ఘటనలను బయటకు రాకుండా గోప్యంగా ఉంచుతున్నారన్న ఆరోపణలు కూడా తల్లిదండ్రుల నుంచి వినిపిస్తున్నాయి. తాజా ఘటన నేపథ్యంలో గురుకులంలో విద్యార్థుల భద్రతా ప్రమాణాలు, సిబ్బంది పర్యవేక్షణపై ఉన్నతాధికారులు దృష్టి సారించాలని వారు కోరుతున్నారు. వరుస ఘటనలపై సమగ్ర విచారణ జరిపి, నిర్లక్ష్యానికి బాధ్యులుగా తేలిన వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.

Sthanikam

రెండో అంతస్తు నుంచి పడి విద్యార్థికి తీవ్రగాయాలు

Article Image

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News