కేతేపల్లి: జ్వరం రావడంతో ఆర్ఎంపీ వైద్యుడిని ఆశ్రయించిన వ్యక్తికి వేసిన సూది వికటించిందని బాధిత కుటుంబ సభ్యులు ఆరోపించారు. కేతేపల్లి మండలం కొప్పోలు గ్రామానికి చెందిన కర్ర వెంకటేశ్వర్లు జ్వరంతో బాధపడుతూ ఆర్ఎంపీ డాక్టర్ మల్లేష్‌ను సంప్రదించినట్లు తెలిపారు.
ఈ క్రమంలో డాక్టర్ మల్లేష్ సూది వేసినట్లు బాధితులు పేర్కొన్నారు. అయితే రెండు, మూడు రోజుల అనంతరం సూది వేసిన ప్రాంతంలో గడ్డకట్టి పరిస్థితి విషమించిందని ఆరోపించారు. దీంతో వెంకటేశ్వర్లుకు ఇబ్బందులు ఎదురయ్యాయని కుటుంబ సభ్యులు తెలిపారు.
ఈ ఘటనపై పూర్తిస్థాయిలో విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని కోరుతూ పోలీసులకు ఫిర్యాదు చేయనున్నట్లు బాధిత కుటుంబ సభ్యులు వెల్లడించారు. ఘటనపై సంబంధిత అధికారులు విచారణ చేపట్టి వాస్తవాలను నిర్ధారించాల్సి ఉంది.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్‌ను పోస్ట్ చేయండి