తెలంగాణ విమోచన దినోత్సవం సందర్భంగా జాతీయ జెండా ఆవిష్కరణ
రామన్నపేట: తెలంగాణ విమోచన దినోత్సవాన్ని పురస్కరించుకుని రామన్నపేటలో బీజేపీ ఆధ్వర్యంలో గురువారం వేడుకలు ఘనంగా నిర్వహించారు. మండల అధ్యక్షుడు బండ మధుకర్‌రెడ్డి ఆధ్వర్యంలో సుభాష్ సెంటర్‌లో జాతీయ జెండాను ఆవిష్కరించారు.
అనంతరం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ జన్మదిన వేడుకలను నిర్వహించారు. ఈ సందర్భంగా బీజేపీ నాయకులు మాట్లాడుతూ.. దేశాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తూ, ప్రపంచంలో భారత్ ప్రతిష్టను మరింత పెంచేందుకు ప్రధాని మోదీ కృషి చేస్తున్నారని పేర్కొన్నారు. మోదీ జన్మదినం సందర్భంగా ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు.
కార్యక్రమానికి బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు నకిరేకంటి మొగులయ్య, రాష్ట్ర కౌన్సిల్ సభ్యుడు వనం అంజయ్య, జిల్లా కార్యవర్గ సభ్యుడు కట్ట యాదయ్య ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. బీజేపీ సీనియర్ నాయకులు డోగుపర్తి సుభాష్, జెల్లా లక్ష్మీనారాయణ, మన్యం పద్మారెడ్డి, రాపోలు స్వామి, శనగొండ భిక్షమాచారి, భాస్కరాచారి, సురవి హరిబాబు, జనరల్ సెక్రటరీ జంగిలి సత్యనారాయణ, బెజ్జంకి శివకుమార్‌చారి, ఉపాధ్యక్షులు కంభంపాటి శివరంజన్, బట్టి రమేష్, కార్యదర్శులు గన్నెబోయిన మధు, బతుక నరేష్, రేపాక లింగస్వామి, ఏనూతుల సురేష్, మచ్చ మహేష్, బతుక సైదులు, తిరుమలేష్, పెండెం శ్రీను, ఘాట్కా శ్రీను తదితరులు పాల్గొన్నారు
.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్‌ను పోస్ట్ చేయండి