Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
మోదీ జన్మదినం సందర్భంగా దీపాలు వెలిగించిన బీజేపీ శ్రేణులు బీసీ మహిళలకు బంపర్ అవకాశం.. కుట్టు మెషీన్ దరఖాస్తు గడువు పొడిగింపు సెప్టెంబర్ 30వ హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన న్యాల్కల్‌లో శ్రావణ మాసం చివరి సోమవారం.. రామలింగేశ్వర ఆలయంలో భక్తుల రద్దీ అక్షరమే ఆయుధం… గురువే దారిచూపే దీపం! నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి రూ.30 వేల లంచం.. రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడితే ఇంట్లో రూ.4.27 కోట్ల కట్టలు! డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: September 17, 2026 09:14 PM

శ్రీ గాయత్రీ కళాశాలలో కన్నులపండువగా గణనాథుని నిమజ్జనం

17-09-2026 23 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
K.RAVI

సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీక వినాయక ఉత్సవాలు: చైర్మన్ మయూర్ రెడ్డి

పట్టణంలోని శ్రీ గాయత్రీ జూనియర్ కళాశాల ఆధ్వర్యంలో వినాయక నవరాత్రి ఉత్సవాలను పురస్కరించుకుని గురువారం గణేష్ నిమజ్జన కార్యక్రమాన్ని భక్తిశ్రద్ధలతో, వైభవంగా నిర్వహించారు. కళాశాల ప్రాంగణం నుంచి ప్రారంభమైన నిమజ్జన ఊరేగింపులో విద్యార్థులు, అధ్యాపకులు, యాజమాన్యం ఉత్సాహంగా పాల్గొన్నారు. ​విద్యార్థులు సాంప్రదాయ దుస్తులు ధరించి, డప్పు చప్పుళ్లు, ఆటపాటలు, నృత్యాలతో సందడి చేశారు. తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలను ప్రతిబింబించేలా సాగిన ఈ ఊరేగింపు అందరినీ ఆకట్టుకుంది. ​ఈ సందర్భంగా కళాశాల చైర్మన్ బండారు మయూర్ రెడ్డి మాట్లాడుతూ.. వినాయక చవితి ఉత్సవాలు విద్యార్థుల్లో భక్తిభావంతో పాటు ఐక్యత, క్రమశిక్షణ, సామాజిక బాధ్యతలను పెంపొందిస్తాయని పేర్కొన్నారు. విద్యార్థులు చదువుతో పాటు మన సంస్కృతి, సంప్రదాయాలను గౌరవిస్తూ భవిష్యత్ తరాలకు అందించాలని సూచించారు. గణనాథుని ఆశీస్సులతో విద్యార్థులందరూ ఉన్నత శిఖరాలను అధిరోహించాలని ఆకాంక్షించారు.

​కళాశాల కరస్పాండెంట్ భీమిడి సుభాష్ రెడ్డి మాట్లాడుతూ.. పండుగల ద్వారా స్నేహభావం, సమైక్యత పెరుగుతాయని తెలిపారు. పర్యావరణ పరిరక్షణకు ప్రాధాన్యతనిస్తూ, క్రమశిక్షణతో నిమజ్జనం నిర్వహించడం అభినందనీయమన్నారు. అనంతరం "గణపతి బప్పా మోరియా" నినాదాల మధ్య గణనాథునికి ఘనంగా వీడ్కోలు పలికారు.

Sthanikam

శ్రీ గాయత్రీ కళాశాలలో కన్నులపండువగా గణనాథుని నిమజ్జనం

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News