చిన్నారుల చేతుల మీదుగా గణనాథునికి ప్రత్యేక పూజలు
మండలంలోని చిన్నకొండూరు గ్రామం బాపూజీ కాలనీలో ఆజాద్ యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో గత 27 ఏళ్లుగా గణేష్ నవరాత్రి ఉత్సవాలను భక్తిశ్రద్ధలతో ఘనంగా నిర్వహిస్తున్నారు. నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా గురువారం చిన్నారుల చేతుల మీదుగా గణనాథునికి ప్రత్యేక పూజా కార్యక్రమాలు కన్నులపండువగా చేపట్టారు. చిన్నారులు ఎంతో ఉత్సాహంతో, భక్తిశ్రద్ధలతో పూజలు నిర్వహించి స్వామివారి ఆశీస్సులు పొందారు. ఈ సందర్భంగా యూత్ నిర్వాహకులు మాట్లాడుతూ.. ఉత్సవాల్లో పిల్లలను భాగస్వామ్యం చేయడం ద్వారా మన సంస్కృతి, సంప్రదాయాలు, ఆధ్యాత్మిక విలువలను వారికి అందిస్తున్నామని తెలిపారు. పాతికేళ్లకు పైగా ఎలాంటి ఆటంకాలు లేకుండా ప్రజలు, యువత సహకారంతో ఉత్సవాలు నిర్వహించడం సంతోషంగా ఉందన్నారు. గణనాథుని ఆశీస్సులతో గ్రామంలో అందరూ ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో ఆజాద్ యూత్ అసోసియేషన్ సభ్యులు, చిన్నారుల తల్లిదండ్రులు, కాలనీవాసులు, భక్తులు పాల్గొన్నారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్‌ను పోస్ట్ చేయండి