రజాకారుల అరాచక పాలనను పాఠ్యపుస్తకాల్లో పొందుపరచాలి:
-బీజేపీ మండల అధ్యక్షులు ఎల్లంల శ్రీధర్ రెడ్డి
మోటకొండూరు:తెలంగాణ విమోచన దినోత్సవం సందర్భంగా మోటకొండూరు మండల కేంద్రంలో భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో జాతీయ జెండా ఆవిష్కరణ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. బీజేపీ మండల అధ్యక్షులు ఎల్లంల శ్రీధర్ రెడ్డి ఆధ్వర్యంలో జాతీయ జెండాను ఆవిష్కరించారు.ఈ సందర్భంగా ఎల్లంల శ్రీధర్ రెడ్డి మాట్లాడుతూ...భారతదేశానికి 1947 ఆగస్టు 15న స్వాతంత్ర్యం వచ్చినప్పటికీ,తెలంగాణ ప్రాంతం నిజాం నిరంకుశ పాలనలో, రజాకారుల అరాచకాలతో అల్లాడిందన్నారు.రజాకారుల దౌర్జన్యాలకు వ్యతిరేకంగా తెలంగాణ ప్రజలు ఎన్నో పోరాటాలు చేసి,అనేకమంది ప్రాణత్యాగాలు చేశారని తెలిపారు.
నాటి భారత ఉప ప్రధాని, కేంద్ర హోంమంత్రి సర్దార్ వల్లభభాయ్ పటేల్ చొరవతో 1948 సెప్టెంబర్ 17న తెలంగాణ ప్రాంతానికి విమోచనం లభించిందని పేర్కొన్నారు. తెలంగాణ విమోచన చరిత్రను,రజాకారుల అరాచకాలను పాఠ్యపుస్తకాల్లో పొందుపరచి,భవిష్యత్ తరాలకు చరిత్రను తెలియజేయాలని కోరారు. తెలంగాణ విమోచన దినోత్సవం ప్రాముఖ్యతపై ప్రజలకు అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని అన్నారు. తెలంగాణ విమోచన దినోత్సవాన్ని రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా నిర్వహించాలనే డిమాండ్‌తో భారతీయ జనతా పార్టీ ఎన్నో పోరాటాలు చేసిందని గుర్తుచేశారు. అయితే కాంగ్రెస్ ప్రభుత్వం సెప్టెంబర్ 17న ప్రజాపాలన దినోత్సవంగా నిర్వహించడం పట్ల ఆయన అసంతృప్తి వ్యక్తం చేశారు.కార్యక్రమంలో జిల్లా నాయకులు పీసరి తిరుమల్ రెడ్డి,జిల్లా కార్యవర్గ సభ్యులు చిర్ర రవీందర్,కిసాన్ మోర్చా జిల్లా ఉపాధ్యక్షులు పాండు రంగారెడ్డి,జిల్లా కిసాన్ మోర్చా అధికార ప్రతినిధి పాశం కృష్ణారెడ్డి,బీజేపీ మండల ప్రధాన కార్యదర్శి మల్గ అశోక్,కిసాన్ మోర్చా మండల అధ్యక్షులు తొడిగల సురేందర్ రెడ్డి, గౌరవ వార్డు సభ్యులు రేగు మల్లేష్, ఆలేటి నాగరాజు,వాకిటి అనిల్ రెడ్డి,బూత్ అధ్యక్షులు పల్లె నరేష్,రేగు ఉపేందర్,జువిలికపల్లి శ్రీను,బాల్ధ నర్సింహులు,శనిగరం ప్రదీప్,భూమండ్ల మురళి,చెందోజు శ్రీనివాస్,మధుసూదన్ రెడ్డి,పాశం శంకర్ రెడ్డి, సుల్తాన్ సతీష్,రేగు ఇస్తారి తదితరులు పాల్గొన్నారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్‌ను పోస్ట్ చేయండి