భీ-స్మార్ట్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ జలంధర్ రెడ్డి చేతుల మీదుగా నియామక పత్రాన్ని అందజేత...
యాదాద్రి భువనగిరి జిల్లా బ్యూరో:శ్రీనివాస్
బడ్జెట్ స్కూల్స్ మేనేజ్మెంట్ అసోసియేషన్ ఆఫ్ తెలంగాణ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ డాక్టర్ పగిడాల జలంధర్ రెడ్డి ఆధ్వర్యంలో భువనగిరి పట్టణం జిల్లా సర్వసభ్య సమావేశం నిర్వహించారు.ఈ కార్యక్రమంలో యాదాద్రి భువనగిరి జిల్లా గౌరవ అధ్యక్షులుగా నోముల బసవ రెడ్డి,జిల్లా అధ్యక్షులుగా కొండూరి మల్లేష్ గౌడ్ ను మహిళా విభాగం అధ్యక్షురాలిగా తీగల జయలక్ష్మిని,ప్రధాన కార్యదర్శిగా ఏ కీర్తి,కోశాధికారిగా ప్యారి బేగం ను,ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. అనంతరం వారికి నియామక పత్రాన్ని అందజేసి జిల్లా కమిటీకి శాలువాతో సత్కరించి శుభాకాంక్షలు తెలిపారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రైవేట్ పాఠశాలల సమస్యలు పరిష్కారానికి బి-స్మార్ట్ ఎల్లప్పుడూ అండగా ఉంటుందని తెలిపారు.
ఎన్నికైన జిల్లా అధ్యక్షులు మల్లేష్ గౌడ్ మాట్లాడుతూ...బి-స్మార్ట్ రాష్ట్ర జిల్లా మండల కమిటీకి,వివిధ పాఠశాలల చెందిన కరస్పాండెంట్లకు ధన్యవాదాలు తెలిపారు.ఈ కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి చిట్టిబాబు,కోశాధికారి ప్రభాకర్ రెడ్డి,దశరథ,విజయ్ కుమార్,వెంకటేష్ వివిధ పాఠశాలలకు చెందిన కరస్పాండెంట్లు తదితరులు పాల్గొన్నారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్‌ను పోస్ట్ చేయండి