Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
తెలంగాణ ఉద్యమకారులందరికీ ప్రభుత్వ గుర్తింపు కార్డులు ఇచ్చి,సంక్షేమ పథకాలు అందించాలి. బీసీ మహిళలకు బంపర్ అవకాశం.. కుట్టు మెషీన్ దరఖాస్తు గడువు పొడిగింపు సెప్టెంబర్ 30వ హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన న్యాల్కల్‌లో శ్రావణ మాసం చివరి సోమవారం.. రామలింగేశ్వర ఆలయంలో భక్తుల రద్దీ అక్షరమే ఆయుధం… గురువే దారిచూపే దీపం! నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి రూ.30 వేల లంచం.. రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడితే ఇంట్లో రూ.4.27 కోట్ల కట్టలు! డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: September 17, 2026 08:10 PM

కంగ్టిలో ఉచిత వైద్య శిబిరం.. 180 మందికి వైద్య పరీక్షలు

17-09-2026 12 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Krishna

కంగ్టి మండల కేంద్రంలో గురువారం రాధా క్లినిక్ ఆధ్వర్యంలో డాక్టర్ నెహ్రూ నేతృత్వంలో ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎముకల బలాన్ని తెలుసుకునేందుకు ఎముకల ఖనిజ సాంద్రత పరీక్షలు నిర్వహించారు. ముఖ్యంగా మహిళల్లో మెనోపాజ్ అనంతరం ఎముకలు బలహీనపడే సమస్యలను ముందుగానే గుర్తించేందుకు ఈ పరీక్షలు ఉపయోగపడతాయని వైద్యులు తెలిపారు. కంగ్టి మండలంతో పాటు పరిసర గ్రామాల నుంచి ప్రజలు పెద్ద సంఖ్యలో శిబిరానికి హాజరయ్యారు. మోకాళ్ల నొప్పులు, ఎముకలకు సంబంధించిన సమస్యలతో బాధపడుతున్న సుమారు 180 మంది వైద్య పరీక్షలు చేయించుకున్నారు. పరీక్షల అనంతరం అవసరమైన చికిత్స, జాగ్రత్తలపై వైద్యులు సూచనలు అందించారు. ఉచితంగా వైద్య సేవలు అందించిన రాధా క్లినిక్ నిర్వాహకులను స్థానికులు అభినందించారు.

Sthanikam

కంగ్టిలో ఉచిత వైద్య శిబిరం.. 180 మందికి వైద్య పరీక్షలు

Article Image

కంగ్టి మండల కేంద్రంలో గురువారం రాధా క్లినిక్ ఆధ్వర్యంలో డాక్టర్ నెహ్రూ నేతృత్వంలో ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎముకల బలాన్ని తెలుసుకునేందుకు ఎముకల ఖనిజ సాంద్రత పరీక్షలు నిర్వహించారు. ముఖ్యంగా మహిళల్లో మెనోపాజ్ అనంతరం ఎముకలు బలహీనపడే సమస్యలను ముందుగానే గుర్తించేందుకు ఈ పరీక్షలు ఉపయోగపడతాయని వైద్యులు తెలిపారు. కంగ్టి మండలంతో పాటు పరిసర గ్రామాల నుంచి ప్రజలు పెద్ద సంఖ్యలో శిబిరానికి హాజరయ్యారు. మోకాళ్ల నొప్పులు, ఎముకలకు సంబంధించిన సమస్యలతో బాధపడుతున్న సుమారు 180 మంది వైద్య పరీక్షలు చేయించుకున్నారు. పరీక్షల అనంతరం అవసరమైన చికిత్స, జాగ్రత్తలపై వైద్యులు సూచనలు అందించారు. ఉచితంగా వైద్య సేవలు అందించిన రాధా క్లినిక్ నిర్వాహకులను స్థానికులు అభినందించారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News