Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
తెలంగాణ ఉద్యమకారులందరికీ ప్రభుత్వ గుర్తింపు కార్డులు ఇచ్చి,సంక్షేమ పథకాలు అందించాలి. బీసీ మహిళలకు బంపర్ అవకాశం.. కుట్టు మెషీన్ దరఖాస్తు గడువు పొడిగింపు సెప్టెంబర్ 30వ హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన న్యాల్కల్‌లో శ్రావణ మాసం చివరి సోమవారం.. రామలింగేశ్వర ఆలయంలో భక్తుల రద్దీ అక్షరమే ఆయుధం… గురువే దారిచూపే దీపం! నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి రూ.30 వేల లంచం.. రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడితే ఇంట్లో రూ.4.27 కోట్ల కట్టలు! డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: September 17, 2026 08:04 PM

ప్రజాసేవలో మరింత ముందుకు సాగాలి. ఎస్ఐల బదిలీ... నాగోలు ఆత్మీయ వీడ్కోలు

17-09-2026 21 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

ప్రజల మన్ననలు పొందాలి

నాగోల్‌: పోలీసు అధికారులు ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటూ వారి సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని నాగోల్‌ పోలీస్‌స్టేషన్‌ సీఐ మక్బుల్ జానీ సూచించారు . నాగోల్‌ పోలీస్‌స్టేషన్‌లో ఎస్‌ఐలుగా విధులు నిర్వహించి చైతన్యపురి పోలీస్‌స్టేషన్‌కు బదిలీ అయిన పి.శివనాగ ప్రసాద్‌, బి.రమేష్‌లకు గురువారం ఘనంగా వీడ్కోలు పలికారు.

ఈ సందర్భంగా సీఐ మక్బుల్ జానీ మాట్లాడుతూ.. పోలీసు విధుల్లో ప్రజలతో సత్సంబంధాలు కొనసాగిస్తూ శాంతిభద్రతల పరిరక్షణకు ప్రాధాన్యమివ్వాలని సూచించారు. సుమారు రెండేళ్ల నాలుగు నెలలపాటు నాగోల్‌లో విధులు నిర్వహించిన శివనాగ ప్రసాద్‌, రమేష్‌లు నిబద్ధతతో పనిచేశారని అభినందించారు. పలు కేసుల దర్యాప్తులో చొరవ చూపడంతోపాటు ప్రజలకు భద్రత కల్పించడంలో సేవలందించారని పేర్కొన్నారు. కొత్త బాధ్యతల్లోనూ సమర్థవంతంగా పనిచేసి ప్రజల మన్ననలు పొందాలని ఆకాంక్షించారు.

బదిలీ అయిన ఎస్‌ఐలు మాట్లాడుతూ.. నాగోల్‌లో విధులు నిర్వహించిన సమయంలో సహకరించిన పోలీసు సిబ్బంది, ప్రజలు, వివిధ రాజకీయ పార్టీల నాయకులకు కృతజ్ఞతలు తెలిపారు. ప్రజల సహకారం, సిబ్బంది సమన్వయంతో విధులను సమర్థవంతంగా నిర్వహించగలిగామని పేర్కొన్నారు.

అనంతరం పోలీసు సిబ్బంది, స్థానిక నాయకులు శివనాగ ప్రసాద్‌, రమేష్‌లను శాలువాలతో సన్మానించి పుష్పగుచ్ఛాలు అందజేశారు. కార్యక్రమంలో కాంగ్రెస్‌ డివిజన్‌ అధ్యక్షుడు చెరుకు చిరంజీవి గౌడ్‌, బీఆర్‌ఎస్‌ డివిజన్‌ అధ్యక్షుడు తూర్పాటి చిరంజీవి, బీఆర్‌ఎస్‌ నాయకులు అనంతుల జంగారెడ్డి, సతీష్‌ యాదవ్‌, బీజేపీ నాయకులు చింతల సురేంద్ర యాదవ్‌, నవచైతన్య యువజన సంఘం అధ్యక్షుడు చెరుకు ప్రవీణ్‌కుమార్‌తో పాటు పలువురు నాయకులు, పోలీసు సిబ్బంది, స్థానికులు పాల్గొన్నారు.

Sthanikam

ప్రజాసేవలో మరింత ముందుకు సాగాలి. ఎస్ఐల బదిలీ... నాగోలు ఆత్మీయ వీడ్కోలు

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News