నారాయణఖేడ్ నియోజకవర్గంలో మానూర్ మండల కేంద్రంలోని తహసీల్దార్ కార్యాలయంలో తెలంగాణ ప్రజా పాలన దినోత్సవాన్ని గురువారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా డిప్యూటీ కలెక్టర్ ప్రతిభ శేఖర్ జాతీయ జెండాను ఆవిష్కరించారు. అనంతరం అధికారులు, కార్యాలయ సిబ్బంది, మండల ప్రజలకు ప్రజా పాలన దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. ప్రజలకు ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలు, సేవలు సక్రమంగా అందేలా అధికారులు, సిబ్బంది బాధ్యతతో పనిచేయాలని సూచించారు. ప్రజల సమస్యలను ఎప్పటికప్పుడు తెలుసుకుని వాటి పరిష్కారానికి కృషి చేయాలని పేర్కొన్నారు. ప్రజలకు ప్రభుత్వ కార్యాలయాల ద్వారా పారదర్శకంగా, సులభంగా సేవలు అందించడమే ప్రజా పాలన లక్ష్యమని తెలిపారు.ఈ కార్యక్రమంలో తహసీల్దార్ విష్ణు సాగర్, డిప్యూటీ తహసీల్దార్ ఆదర్శ్ కుమార్, ఆర్‌ఐ శంకర్ రెడ్డి, జూనియర్ అసిస్టెంట్ ఖాజా మొయినుద్దీన్, రఘురాములు, నర్సింహారెడ్డి, కార్యాలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
మానూర్‌లో ఘనంగా ప్రజా పాలన దినోత్సవ వేడుకలు

Krishna

పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్‌ను పోస్ట్ చేయండి