నారాయణఖేడ్ ఏరియా ప్రభుత్వ ఆసుపత్రిలో గురువారం ప్రపంచ రోగి భద్రతా దినోత్సవాన్ని పురస్కరించుకుని రోగులకు పండ్ల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు.ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ రమేష్, ఆర్‌ఎం డాక్టర్, వైద్య సిబ్బంది సమక్షంలో నేషనల్ హ్యూమన్ రైట్స్ సోషల్ జస్టిస్ సోషల్ సర్వీస్ ఫర్ చేంజ్ ఆఫ్ ఇండియా రాష్ట్ర వైస్ చైర్మన్ వై. పండరి, జిల్లా అధ్యక్షులు బైండ్ల కృష్ణ, జిల్లా ఎగ్జిక్యూటివ్ సభ్యులు ప్రభాకర్, రాయికోడ్ మండల అధ్యక్షులు కె. శ్రీనివాస్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న రోగులకు పండ్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా రోగుల ఆరోగ్యం, భద్రతకు ప్రాధాన్యం ఇవ్వాలని, ఆసుపత్రికి వచ్చే ప్రతి ఒక్కరికీ మెరుగైన వైద్య సేవలు అందేలా చర్యలు తీసుకోవాలని వారు పేర్కొన్నారు. రోగుల పట్ల మానవతా దృక్పథంతో సేవా కార్యక్రమాలు నిర్వహించడం అభినందనీయమని ఆసుపత్రి సిబ్బంది తెలిపారు. కార్యక్రమంలో వైద్యులు, ఆసుపత్రి సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
ప్రపంచ రోగి భద్రతా దినోత్సవం.. రోగులకు పండ్ల పంపిణీ చేసిన: నేషనల్ హ్యూమన్ రైట్స్ బృందం

Krishna
నారాయణఖేడ్ ఏరియా ప్రభుత్వ ఆసుపత్రిలో గురువారం ప్రపంచ రోగి భద్రతా దినోత్సవాన్ని పురస్కరించుకుని రోగులకు పండ్ల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు.ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ రమేష్, ఆర్‌ఎం డాక్టర్, వైద్య సిబ్బంది సమక్షంలో నేషనల్ హ్యూమన్ రైట్స్ సోషల్ జస్టిస్ సోషల్ సర్వీస్ ఫర్ చేంజ్ ఆఫ్ ఇండియా రాష్ట్ర వైస్ చైర్మన్ వై. పండరి, జిల్లా అధ్యక్షులు బైండ్ల కృష్ణ, జిల్లా ఎగ్జిక్యూటివ్ సభ్యులు ప్రభాకర్, రాయికోడ్ మండల అధ్యక్షులు కె. శ్రీనివాస్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న రోగులకు పండ్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా రోగుల ఆరోగ్యం, భద్రతకు ప్రాధాన్యం ఇవ్వాలని, ఆసుపత్రికి వచ్చే ప్రతి ఒక్కరికీ మెరుగైన వైద్య సేవలు అందేలా చర్యలు తీసుకోవాలని వారు పేర్కొన్నారు. రోగుల పట్ల మానవతా దృక్పథంతో సేవా కార్యక్రమాలు నిర్వహించడం అభినందనీయమని ఆసుపత్రి సిబ్బంది తెలిపారు. కార్యక్రమంలో వైద్యులు, ఆసుపత్రి సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్‌ను పోస్ట్ చేయండి