సంగారెడ్డి జిల్లా పోలీసు సాయుధ దళ కార్యాలయ ప్రాంగణంలో ప్రతిష్ఠించిన గణనాథునికి జిల్లా ఎస్పీ పరితోష్ పంకజ్, ఐపీఎస్ దంపతులు, అదనపు ఎస్పీ చైతన్య రెడ్డి ఘనంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా గణనాథునికి పుష్పాలు, పండ్లు సమర్పించి ప్రత్యేక హారతి ఇచ్చారు. జిల్లా ప్రజలు, పోలీసు అధికారులు, సిబ్బంది ఆయురారోగ్యాలతో సుఖసంతోషాలతో ఉండాలని, వారి జీవితాల్లో శాంతి, సౌభాగ్యం నెలకొనాలని గణనాథుని ప్రార్థించారు. ప్రజల రక్షణ కోసం అంకితభావంతో విధులు నిర్వహిస్తున్న పోలీసులకు ధైర్యం, శక్తి, మానసిక ప్రశాంతత ప్రసాదించాలని, విధి నిర్వహణలో ఎలాంటి ఆటంకాలు ఎదురుకాకుండా గణనాథుని ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండాలని ఎస్పీ ఆకాంక్షించారు. అలాగే పోలీసు సిబ్బంది కుటుంబాల్లో ఆరోగ్యం, ఆనందం, శ్రేయస్సు నెలకొనాలని కోరుకున్నారు.వినాయక చవితి నవరాత్రి ఉత్సవాలను ప్రజలందరూ భక్తిశ్రద్ధలతో, పరస్పర సోదరభావం, ఐక్యతతో శాంతియుత వాతావరణంలో నిర్వహించుకోవాలని ఎస్పీ సూచించారు. ఉత్సవాల ప్రారంభం నుంచి నిమజ్జనం వరకు ప్రతి ఒక్కరూ పోలీసుశాఖకు సహకరిస్తూ శాంతిభద్రతల పరిరక్షణలో భాగస్వాములు కావాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో ఎఆర్ డీఎస్పీ నరేందర్, సంగారెడ్డి డీఎస్పీ సత్యయ్య గౌడ్, ఎస్‌బీ ఇన్‌స్పెక్టర్ సదా నాగరాజు, డీసీఆర్‌బీ ఇన్‌స్పెక్టర్ రమేష్, పలువురు ఇన్‌స్పెక్టర్లు, ఆర్‌ఐలు, ఆర్‌ఎస్‌ఐలు, పోలీసు సంఘం అధ్యక్షుడు జనార్దన్, పోలీసు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
గణనాథుని సన్నిధిలో జిల్లా ఎస్పీ ప్రత్యేక పూజలు

Krishna

పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్‌ను పోస్ట్ చేయండి