ఆపదలో ఉన్న వ్యక్తికి సకాలంలో స్పందించి సహాయం అందిస్తూ నారాయణఖేడ్ డిప్యూటీ డీఎంహెచ్‌ఓ నర్సింగ్ చౌహాన్ మానవత్వాన్ని చాటుకున్నారు. ఆదివారం మనూర్ మండలం ముక్టాపూర్ సమీపంలో ఓ వాహనం అదుపుతప్పి రోడ్డుపక్కన బోల్తాపడటంతో అందులో ప్రయాణిస్తున్న వ్యక్తికి గాయాలయ్యాయి. అదే సమయంలో అటుగా వెళ్తున్న నర్సింగ్ చౌహాన్ ప్రమాదాన్ని గమనించి వెంటనే అక్కడికి చేరుకుని గాయపడిన వ్యక్తికి ప్రాథమిక సహాయం అందించారు. అనంతరం ఎలాంటి ఆలస్యం చేయకుండా తన వాహనంలో ఆసుపత్రికి తరలించి వైద్యం అందేలా చర్యలు తీసుకున్నారు. ప్రమాదాన్ని గమనించిన వెంటనే స్పందించి బాధితుడికి అండగా నిలిచిన నర్సింగ్ చౌహాన్‌ను స్థానికులు అభినందించారు. విధుల్లో భాగంగా కాకుండా ఆపదలో ఉన్న వ్యక్తికి మానవతా దృక్పథంతో సహాయం చేయడం అభినందనీయమని స్థానికులు పేర్కొన్నారు
PRINT TIME: September 14, 2026 09:15 PM
ఆపదలో అండగా.. నర్సింగ్ చౌహాన్ మానవత్వం
ఆపదలో అండగా.. నర్సింగ్ చౌహాన్ మానవత్వం
14-09-2026
2 Views
స్థానికం ప్రతినిధి :
Sub Editor
Krishna
ఆపదలో ఉన్న వ్యక్తికి సకాలంలో స్పందించి సహాయం అందిస్తూ నారాయణఖేడ్ డిప్యూటీ డీఎంహెచ్‌ఓ నర్సింగ్ చౌహాన్ మానవత్వాన్ని చాటుకున్నారు. ఆదివారం మనూర్ మండలం ముక్టాపూర్ సమీపంలో ఓ వాహనం అదుపుతప్పి రోడ్డుపక్కన బోల్తాపడటంతో అందులో ప్రయాణిస్తున్న వ్యక్తికి గాయాలయ్యాయి. అదే సమయంలో అటుగా వెళ్తున్న నర్సింగ్ చౌహాన్ ప్రమాదాన్ని గమనించి వెంటనే అక్కడికి చేరుకుని గాయపడిన వ్యక్తికి ప్రాథమిక సహాయం అందించారు. అనంతరం ఎలాంటి ఆలస్యం చేయకుండా తన వాహనంలో ఆసుపత్రికి తరలించి వైద్యం అందేలా చర్యలు తీసుకున్నారు. ప్రమాదాన్ని గమనించిన వెంటనే స్పందించి బాధితుడికి అండగా నిలిచిన నర్సింగ్ చౌహాన్‌ను స్థానికులు అభినందించారు. విధుల్లో భాగంగా కాకుండా ఆపదలో ఉన్న వ్యక్తికి మానవతా దృక్పథంతో సహాయం చేయడం అభినందనీయమని స్థానికులు పేర్కొన్నారు

పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్‌ను పోస్ట్ చేయండి