కోదాడ పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఈ నెల 19వ తేదీన నిర్వహించనున్న మెగా జాబ్ మేళా ఏర్పాట్లపై శాసనసభ్యురాలు ఉత్తమ్ పద్మావతి రెడ్డి ఆధ్వర్యంలో సోమవారం సమీక్ష సమావేశం నిర్వహించారు.ఈ సమావేశానికి ఏఐసీసీ సభ్యులు రాంరెడ్డి సర్వోత్తమ్ రెడ్డి హాజరై జాబ్ మేళా ఏర్పాట్లు, యువతకు అందించనున్న ఉద్యోగ అవకాశాలు, వివిధ కంపెనీల భాగస్వామ్యం తదితర అంశాలపై చర్చించారు.నిరుద్యోగ యువతకు మెరుగైన ఉద్యోగ అవకాశాలు అందించడంతో పాటు, అర్హతకు తగిన ఉద్యోగాన్ని పొందేందుకు అవసరమైన మార్గదర్శకత్వం కల్పించేలా జాబ్ మేళాను విస్తృతంగా నిర్వహించాలని సమావేశంలో నిర్ణయించారు.యువత భవిష్యత్తుకు బాటలు వేస్తూ.. ఉద్యోగ అవకాశాల కల్పనే లక్ష్యంగా ఈ మెగా జాబ్ మేళాను విజయవంతం చేయాలని నాయకులు పిలుపునిచ్చారు.
PRINT TIME: September 14, 2026 09:56 PM
యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించడమే లక్ష్యం.. మెగా జాబ్ మేళాను విజయవంతం చేయాలి

14-09-2026
16 Views
స్థానికం ప్రతినిధి :
Kodada
Harish reporter
కోదాడ పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఈ నెల 19వ తేదీన నిర్వహించనున్న మెగా జాబ్ మేళా ఏర్పాట్లపై శాసనసభ్యురాలు ఉత్తమ్ పద్మావతి రెడ్డి ఆధ్వర్యంలో సోమవారం సమీక్ష సమావేశం నిర్వహించారు.ఈ సమావేశానికి ఏఐసీసీ సభ్యులు రాంరెడ్డి సర్వోత్తమ్ రెడ్డి హాజరై జాబ్ మేళా ఏర్పాట్లు, యువతకు అందించనున్న ఉద్యోగ అవకాశాలు, వివిధ కంపెనీల భాగస్వామ్యం తదితర అంశాలపై చర్చించారు.నిరుద్యోగ యువతకు మెరుగైన ఉద్యోగ అవకాశాలు అందించడంతో పాటు, అర్హతకు తగిన ఉద్యోగాన్ని పొందేందుకు అవసరమైన మార్గదర్శకత్వం కల్పించేలా జాబ్ మేళాను విస్తృతంగా నిర్వహించాలని సమావేశంలో నిర్ణయించారు.యువత భవిష్యత్తుకు బాటలు వేస్తూ.. ఉద్యోగ అవకాశాల కల్పనే లక్ష్యంగా ఈ మెగా జాబ్ మేళాను విజయవంతం చేయాలని నాయకులు పిలుపునిచ్చారు.

పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్‌ను పోస్ట్ చేయండి