రాష్ట్రవ్యాప్తంగా 5,000 మట్టి విగ్రహాల ఉచిత వితరణ: కస్తూరి ఫౌండేషన్
పర్యావరణ పరిరక్షణతోనే భవిష్యత్ తరాలకు భద్రత
పర్యావరణ పరిరక్షణే లక్ష్యంగా కస్తూరి ఫౌండేషన్ ఆధ్వర్యంలో చేపట్టిన మట్టి వినాయక విగ్రహాల పంపిణీ కార్యక్రమం సంస్థాన్ నారాయణపూర్‌లో ఘనంగా నిర్వహించారు. ఫౌండేషన్ ఆధ్వర్యంలో రాష్ట్రవ్యాప్తంగా 5,000 మట్టి విగ్రహాలను పంపిణీ చేస్తుండగా, స్థానికంగా ఫౌండేషన్ సభ్యుడు వీరమల్ల కార్తీక్ గౌడ్ పర్యవేక్షణలో ప్రజలకు మట్టి వినాయక విగ్రహాలను అందజేశారు. ఈ కార్యక్రమానికి స్థానిక ప్రజలు, యువత పెద్ద సంఖ్యలో తరలివచ్చి విగ్రహాలను ఉత్సాహంగా స్వీకరించారు.ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ.. కస్తూరి ఫౌండేషన్ చైర్మన్ కస్తూరి శ్రీచరణ్ గత కొన్ని సంవత్సరాలుగా వినాయక చవితి సందర్భంగా నిరంతరాయంగా మట్టి విగ్రహాలను పంపిణీ చేస్తూ ప్రజల్లో పర్యావరణ చైతన్యం నింపుతున్నారని కొనియాడారు. "మట్టి వినాయకుడిని పూజిద్దాం.. పర్యావరణాన్ని పరిరక్షిద్దాం" అనే గొప్ప సందేశంతో సమాజ సేవ చేయడం అభినందనీయమన్నారు. ప్లాస్టర్ ఆఫ్ పారిస్ విగ్రహాల వల్ల నీటి వనరులు కలుషితమవుతున్నాయని, భక్తితో పాటు ప్రకృతిని కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరిపై ఉందన్నారు. భవిష్యత్తులోనూ ఫౌండేషన్ ద్వారా మరిన్ని సామాజిక సేవా కార్యక్రమాలు నిర్వహించాలని కోరారు. ఈ కార్యక్రమంలో నాయకులు, ప్రతినిధులు మందుగుల బాలకృష్ణ, పాలకుర్ల యాదయ్య, తెలంగాణ బిక్షం, ఎలిజాల శీను, సిలివేరు సైదులు, బద్దం యాదయ్య, కొండ శ్రీకాంత్, దూసరి వెంకటేశం, బైక్ కానీ నరేందర్, రామకృష్ణ, వేణు, రాజు, వీడం సాయి, ప్రభాకర్, సునీల్, నవీన్ తదితరులు పాల్గొన్నారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్‌ను పోస్ట్ చేయండి