భక్తిశ్రద్ధలతో.. సోదరభావంతో వేడుకలు జరుపుకోవాలి : ఎస్పీ శరత్ చంద్ర పవార్.
నల్లగొండ: వినాయక నవరాత్రి ఉత్సవాలను భక్తిశ్రద్ధలతో, శాంతియుత వాతావరణంలో నిర్వహించాలని జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్, ఐపీఎస్ సూచించారు. సోమవారం జిల్లా పోలీస్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన వినాయక విగ్రహం వద్ద ఎస్పీ ప్రత్యేక పూజలు నిర్వహించారు.
ఈ సందర్భంగా జిల్లాలోని ప్రజలందరూ సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో ఉండాలని ఆకాంక్షించారు.
ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ జిల్లా ప్రజలకు, పోలీస్ సిబ్బందికి వినాయక చవితి శుభాకాంక్షలు తెలిపారు.
ఉత్సవాలను పరస్పర గౌరవం, సోదరభావంతో నిర్వహించుకోవాలని కోరారు. ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా, శాంతిభద్రతలకు విఘాతం కలగకుండా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో అవసరమైన భద్రతా చర్యలు చేపడుతున్నట్లు తెలిపారు.ఉత్సవ కమిటీలు, నిర్వాహకులు పోలీస్ శాఖ సూచనలు, నిబంధనలు తప్పనిసరిగా పాటించాలని సూచించారు.
పండుగను ఆనందంగా జరుపుకుంటూనే బాధ్యతాయుతంగా వ్యవహరించాలని, ఎలాంటి అవాంఛనీయ ఘటనలకు తావులేకుండా సహకరించాలని ఎస్పీ కోరారు.కార్యక్రమంలో అడిషనల్ ఎస్పీ రమేష్, ఎస్‌బీ సీఐ నాగరాజు, ఆర్‌ఐలు సంతోష్, సూరప్ప నాయుడు, కళ్యాణ్ రాజ్, ఉత్సవ కమిటీ సభ్యులు, పోలీస్ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్‌ను పోస్ట్ చేయండి