నారాయణఖేడ్: తెలంగాణ విమోచన దినోత్సవాన్ని ప్రభుత్వం అధికారికంగా నిర్వహించాలని బీజేపీ నాయకులు డిమాండ్ చేశారు. ఈ మేరకు నారాయణఖేడ్‌లో బీజేపీ ఆధ్వర్యంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో మాజీ ఎమ్మెల్యే విజయపాల్ రెడ్డి మాట్లాడారు. సర్దార్ వల్లభ్‌భాయ్ పటేల్ నాయకత్వంలో జరిగిన ఆపరేషన్ పోలోతో పాటు తెలంగాణ ప్రజల పోరాటం ఫలితంగా హైదరాబాద్ రాష్ట్రం భారతదేశంలో విలీనమై ప్రజలకు స్వేచ్ఛ లభించిందని తెలిపారు. ఈ చారిత్రక ఘట్టాన్ని ప్రజలకు గుర్తుచేసేలా ప్రతి ఏడాది తెలంగాణ విమోచన దినోత్సవాన్ని ప్రభుత్వం అధికారికంగా నిర్వహించాలని కోరారు. ఈ కార్యక్రమాన్ని అధికారికంగా నిర్వహించకపోవడంపై కాంగ్రెస్ ప్రభుత్వాన్ని, తెలంగాణ సాధన గురించి మాట్లాడే ఇతర నాయకులను ఆయన విమర్శించారు. సమావేశంలో బీజేపీ అధికార ప్రతినిధి సంగప్పతో పాటు పలువురు బీజేపీ నాయకులు పాల్గొన్నారు.
విమోచన దినోత్సవాన్ని అధికారికంగా జరపాలి: మాజీ ఎమ్మెల్యే విజయపాల్ రెడ్డి

Krishna
నారాయణఖేడ్: తెలంగాణ విమోచన దినోత్సవాన్ని ప్రభుత్వం అధికారికంగా నిర్వహించాలని బీజేపీ నాయకులు డిమాండ్ చేశారు. ఈ మేరకు నారాయణఖేడ్‌లో బీజేపీ ఆధ్వర్యంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో మాజీ ఎమ్మెల్యే విజయపాల్ రెడ్డి మాట్లాడారు. సర్దార్ వల్లభ్‌భాయ్ పటేల్ నాయకత్వంలో జరిగిన ఆపరేషన్ పోలోతో పాటు తెలంగాణ ప్రజల పోరాటం ఫలితంగా హైదరాబాద్ రాష్ట్రం భారతదేశంలో విలీనమై ప్రజలకు స్వేచ్ఛ లభించిందని తెలిపారు. ఈ చారిత్రక ఘట్టాన్ని ప్రజలకు గుర్తుచేసేలా ప్రతి ఏడాది తెలంగాణ విమోచన దినోత్సవాన్ని ప్రభుత్వం అధికారికంగా నిర్వహించాలని కోరారు. ఈ కార్యక్రమాన్ని అధికారికంగా నిర్వహించకపోవడంపై కాంగ్రెస్ ప్రభుత్వాన్ని, తెలంగాణ సాధన గురించి మాట్లాడే ఇతర నాయకులను ఆయన విమర్శించారు. సమావేశంలో బీజేపీ అధికార ప్రతినిధి సంగప్పతో పాటు పలువురు బీజేపీ నాయకులు పాల్గొన్నారు.

పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్‌ను పోస్ట్ చేయండి