పిగ్లిపూర్: పిగ్లిపూర్ గ్రామంలోని సాయి నగర్ టౌన్‌షిప్‌లో వినాయక మండపాన్ని ఘనంగా ప్రారంభించారు. పిగ్లిపూర్ సర్పంచ్ కోట ప్రభాకర్ రెడ్డి తల్లి కోట నిర్మలమ్మ జ్ఞాపకార్థం ఈ వినాయక మండపాన్ని వారి కుటుంబ సభ్యులు స్వంత ఖర్చులతో నిర్మించారు.
కోట రామిరెడ్డి, సుజాత–ప్రభాకర్ రెడ్డి దంపతులు, మనుమలు నికిత, రితీష్ రెడ్డి, సాయి తేజ రెడ్డి తదితర కుటుంబ సభ్యుల సహకారంతో మండప నిర్మాణం చేపట్టారు.
ఈ కార్యక్రమంలో సర్పంచ్ కోట ప్రభాకర్ రెడ్డి, ఉప సర్పంచ్ దుర్గం నరసింహ యాదవ్, వార్డు సభ్యులు జక్కుల శివకుమార్, జక్కుల ఝాన్సీ–ఆంజనేయులు, వర్ధన్ లావణ్య–హనుమంతు, జక్కుల పరమేష్, పంది మురళీకృష్ణ, కొండ రమేష్, కొలను హరిణి–మహేందర్ రెడ్డి, వెంకటేశ్వరరావు, వెంకట్ రెడ్డి పాల్గొన్నారు.
అలాగే పిగ్లిపూర్ గ్రామానికి చెందిన పెద్దలు, యువత, మహిళలు, చిన్నారులు, సాయి నగర్ కాలనీ వాసులు పెద్ద సంఖ్యలో పాల్గొని వినాయకుడికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. మండపం ప్రారంభోత్సవంతో సాయి నగర్‌లో పండుగ వాతావరణం నెలకొంది.
















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్‌ను పోస్ట్ చేయండి