Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
ప్రజలకు ఇబ్బంది లేకుండా బైపాస్ రోడ్డు అభివృద్ధి చేయాలి:టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి బీసీ మహిళలకు బంపర్ అవకాశం.. కుట్టు మెషీన్ దరఖాస్తు గడువు పొడిగింపు సెప్టెంబర్ 30వ హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన న్యాల్కల్‌లో శ్రావణ మాసం చివరి సోమవారం.. రామలింగేశ్వర ఆలయంలో భక్తుల రద్దీ అక్షరమే ఆయుధం… గురువే దారిచూపే దీపం! నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి రూ.30 వేల లంచం.. రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడితే ఇంట్లో రూ.4.27 కోట్ల కట్టలు! డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: September 16, 2026 05:46 PM

చలో నాంపల్లి సభను విజయవంతం చేయాలి.

చలో నాంపల్లి సభను విజయవంతం చేయాలి.

చలో నాంపల్లి సభను విజయవంతం చేయాలి.
15-09-2026 19 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

సెప్టెంబర్‌ 17న హైదరాబాద్‌ నాంపల్లి ఎగ్జిబిషన్‌ గ్రౌండ్‌లో నిర్వహించే తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట యోధుల బహిరంగ సభను విజయవంతం చేయాలని సీపీఐ జిల్లా సహాయ కార్యదర్శి బోలగాని సత్యనారాయణ పిలుపునిచ్చారు. మంగళవారం మోటకొండూరు మండల కేంద్రంలో తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటంలో అమరులైన యోధుల స్థూపాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు.

ఈ సందర్భంగా సత్యనారాయణ మాట్లాడుతూ.. నిజాం నిరంకుశత్వం, దొరలు, భూస్వాముల దోపిడీకి వ్యతిరేకంగా భారత కమ్యూనిస్టు పార్టీ నాయకత్వంలో 1946 నుంచి 1951 వరకు తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం సాగిందన్నారు. ‘దున్నేవాడికే భూమి’ నినాదంతో సాగిన పోరాటంలో వేలాది గ్రామాలు వెట్టిచాకిరీ నుంచి విముక్తి పొందడంతోపాటు పది లక్షల ఎకరాల భూమిని పేదలకు పంపిణీ చేసిన ఘనత ఉందన్నారు. సుమారు నాలుగు వేల మంది అమరుల త్యాగాలతో తెలంగాణ సాయుధ పోరాటం చరిత్రలో చిరస్థాయిగా నిలిచిందన్నారు.

తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట చరిత్రను పాఠ్యపుస్తకాల్లో చేర్చాలని, సెప్టెంబర్‌ 17ను ప్రభుత్వం అధికారికంగా గుర్తించి విముక్తి దినంగా ప్రకటించాలని డిమాండ్‌ చేశారు.

కార్యక్రమంలో సీపీఐ మండల కార్యదర్శి గాధగాని మాణిక్యం, మండల సహాయ కార్యదర్శులు ముసుకు పెంటారెడ్డి, ఆలేటి బాలరాజు, మండల కార్యవర్గ సభ్యులు పల్లె వెంకన్న, పశువుల నర్సింహ, మంచాల రాధమ్మ, బొడిగె సుదర్శన్, సుధాగాని వెంకన్న, ఎండీ పాషా, కంచర్ల మల్లయ్య, దేవల్ల బాలరాజు, మంచాల మాధవి, మంచాల సువర్ణ, ఎండీ యూసుఫ్, దూశెట్టి అండాలు, బండి అనసూయ, పంగక అండాలు, సోపరి సోములు, రవీందర్‌రెడ్డి, సాయిలు, నర్సింలు, స్వామి, రామయ్య తదితరులు పాల్గొన్నారు.

Sthanikam

చలో నాంపల్లి సభను విజయవంతం చేయాలి.

Article Image

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News