'గాంధీగిరి'తో మున్సిపల్ అధికారుల వినూత్న నిరసన!
పరిశుభ్రత మన బాధ్యత... బహిరంగంగా పడేస్తే జరిమానా!
పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని, బహిరంగ ప్రదేశాల్లో చెత్త వేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని చౌటుప్పల్ మున్సిపాలిటీ హెచ్చరించింది. జాతీయ రహదారి (NH 65) వలిగొండ జంక్షన్ నుంచి లింగోజిగూడెం వెళ్లే రహదారి పక్కన నిబంధనలకు విరుద్ధంగా చెత్త వేస్తున్న వారిని మున్సిపల్ సిబ్బంది బుధవారం పట్టుకున్నారు. ఈ సందర్భంగా శానిటేషన్ సిబ్బంది వినూత్నంగా స్పందించారు. రహదారి పక్కన చెత్త వేస్తూ దొరికిన నలుగురు వ్యక్తులకు మర్యాదపూర్వకంగా పూలదండలు వేసి ('గాంధీగిరి' పద్ధతిలో) అవగాహన కల్పించారు. రహదారుల పక్కన చెత్త వేయవద్దని విజ్ఞప్తి చేస్తూనే, ఒక్కొక్కరికి రూ. 500 చొప్పున జరిమానా విధించారు. రోజూ విధులకు వెళ్లే కొంతమంది వ్యక్తులు మార్గమధ్యలో చెత్త పడేస్తుండటం వల్ల, సిబ్బంది సమయమంతా దాన్ని శుభ్రం చేయడానికే సరిపోతోందని అధికారులు తెలిపారు. ప్రజలందరూ మున్సిపాలిటీ చెత్త సేకరణ వాహనాలకే చెత్తను అందించి, పరిశుభ్రతకు సహకరించాలని అధికారులు విజ్ఞప్తి చేశారు. మున్సిపల్ చైర్‌పర్సన్ మొగుదాల పావని రమేష్ గౌడ్, కమిషనర్ ఎన్. వెంకటేశ్వర నాయక్ ఆదేశాల మేరకు ఈ తనిఖీలు చేపట్టారు. శానిటరీ ఇన్‌స్పెక్టర్ హనుమాన్ ప్రసాద్, ఎన్విరాన్‌మెంటల్ ఇంజనీర్ రేణు కుమార్, జవాన్ అంజయ్య తదితరులు పాల్గొన్నారు.
















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్‌ను పోస్ట్ చేయండి