Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
త్రిశూల్ యూత్ వినాయక మండపానికి ఎమ్మెల్యే చింత ప్రభాకర్ రాక బీసీ మహిళలకు బంపర్ అవకాశం.. కుట్టు మెషీన్ దరఖాస్తు గడువు పొడిగింపు సెప్టెంబర్ 30వ హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన న్యాల్కల్‌లో శ్రావణ మాసం చివరి సోమవారం.. రామలింగేశ్వర ఆలయంలో భక్తుల రద్దీ అక్షరమే ఆయుధం… గురువే దారిచూపే దీపం! నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి రూ.30 వేల లంచం.. రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడితే ఇంట్లో రూ.4.27 కోట్ల కట్టలు! డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: September 16, 2026 07:32 PM

వర్షంలోనూ విధుల నిర్వహణకు అండగా పోలీస్ శాఖ..

16-09-2026 37 Views
Reporter
స్థానికం ప్రతినిధి : District Bureau Nalagonda
NM Yadav

సిబ్బంది సంక్షేమానికి మొదటి ప్రాధాన్యం..

రెయిన్ కోట్లు పంపిణీ చేసిన ఎస్పీ శరత్ చంద్ర పవార్..

నల్లగొండ: ప్రతికూల వాతావరణ పరిస్థితుల్లోనూ అంకితభావంతో పనిచేసే పోలీస్ సిబ్బంది సంక్షేమానికి జిల్లా పోలీస్ శాఖ ఎల్లవేళలా కట్టుబడి ఉంటుందని ఎస్పీ శరత్ చంద్ర పవార్ అన్నారు. వర్షాకాలంలో విధి నిర్వహణలో ఎదురయ్యే ఇబ్బందులను అధిగమించేందుకు జిల్లా పోలీస్ కార్యాలయంలో సిబ్బందికి బుధవారం రెయిన్ కోట్లను అందజేశారు.

​ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ.. వర్షాలు కురుస్తున్నప్పటికీ రవాణా నియంత్రణ, బందోబస్తు, రాత్రి సమయాల్లో పెట్రోలింగ్ నిర్వహించే సిబ్బంది సేవలు అభినందనీయమన్నారు.

ప్రజల భద్రత కోసం నిరంతరం శ్రమిస్తున్న సిబ్బందికి అవసరమైన రక్షణ పరికరాలు, మౌలిక వసతులు కల్పించడం శాఖ బాధ్యత అని స్పష్టం చేశారు. విధి నిర్వహణతో పాటు సిబ్బంది తమ ఆరోగ్యం పట్లా ప్రత్యేక శ్రద్ధ వహించాలని సూచించారు. క్షేత్రస్థాయిలో ఎలాంటి సమస్యలు ఎదురైనా వెంటనే ఉన్నతాధికారుల దృష్టికి తీసుకురావాలని, వాటి పరిష్కారానికి తగిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.ఈ కార్యక్రమంలో అడిషనల్ ఎస్పీ రమేష్, ఏఆర్ డీఎస్పీ శ్రీనివాసులు, ఆర్ఐలు సంతోష్, శ్రీనుతో పాటు పలువురు పోలీస్ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.

Sthanikam

వర్షంలోనూ విధుల నిర్వహణకు అండగా పోలీస్ శాఖ..

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News