హైదరాబాద్ విముక్తి పోరాటంలో మహనీయులు చేసిన త్యాగాల చరిత్రను పాఠ్య పుస్తకాల్లో చేర్చాలని హర్యానా మాజీ గవర్నర్ బండారు దత్తాత్రేయ అన్నారు. సెప్టెంబర్ 17 ప్రాధాన్యతను గుర్తిస్తూ కేంద్ర ప్రభుత్వం హైదరాబాద్ విమోచన దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహించడం హర్షణీయమన్నారు. రాష్ట్ర ప్రభుత్వం కూడా అధికారికంగా వేడుకలు నిర్వహించాలని కోరారు. సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్‌లో సీబీసీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన రెండు రోజుల ఫొటో ప్రదర్శనను బుధవారం ఆయన ప్రారంభించారు.నిజాం పాలనలో ప్రజలపై జరిగిన దమనకాండ, విముక్తి పోరాటంలో సమరయోధుల పాత్ర, హైదరాబాద్ సంస్థానం భారతదేశంలో విలీనమైన క్రమాన్ని వివరించేలా ప్రదర్శన ఏర్పాటు చేశారు. మల్కాజ్‌గిరి ఎంపీ ఈటల రాజేందర్, మాజీ ఎమ్మెల్సీ రాంచందర్‌రావుతో కలిసి దత్తాత్రేయ ప్రదర్శనను పరిశీలించారు. విద్యార్థులు ప్రదర్శనను సందర్శించి చరిత్రను తెలుసుకోవాలని సూచించారు.ఈటల రాజేందర్ మాట్లాడుతూ హైదరాబాద్ ప్రజలు అనుభవిస్తున్న స్వేచ్ఛ వెనుక అనేక త్యాగాలు ఉన్నాయని అన్నారు. రాంజీగోండు, దొడ్డి కొమురయ్య, చాకలి ఐలమ్మ వంటి యోధుల త్యాగాలను నేటి తరం గుర్తుంచుకోవాలని పేర్కొన్నారు. హైదరాబాద్ విమోచన చరిత్రను భావితరాలకు తెలియజేయాల్సిన అవసరం ఉందని రాంచందర్‌రావు అన్నారు. కార్యక్రమంలో సీబీసీ, పీఐబీ అదనపు డైరెక్టర్ జనరల్ శ్రుతి పాటిల్, సమీర్ నందా, రాజీవ్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు.
విముక్తి పోరాట చరిత్ర పాఠ్యాంశాల్లో చేర్చాలి. బండారు దత్తాత్రేయ

Editor Desk

పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్‌ను పోస్ట్ చేయండి