హైదరాబాద్ సెప్టెంబర్ 16 స్థానికం ప్రతినిధి :
బీసీ కవుల అస్తిత్వాన్ని ప్రతిబింబిస్తూ 2001లో వెలువడిన ‘వెంటాడే కలాలు.. వెనుకబడిన కులాలు’ కవిత్వ సంకలనం 25 ఏళ్లు పూర్తి చేసుకుంది. ప్రముఖ కవి జూలూరు గౌరీశంకర్ సంపాదకత్వంలో 23 మంది కవుల రచనలతో వెలువడిన ఈ సంకలనం బీసీ కవిత్వానికి ప్రత్యేక గుర్తింపు తెచ్చిందని ప్రముఖ సాహితీవేత్త, ప్రభుత్వ డిగ్రీ కళాశాల తెలుగు శాఖ అధ్యక్షుడు డాక్టర్ తండు కృష్ణ కౌండిన్య పేర్కొన్నారు.
ఈ సందర్భంగా సంకలనం 25 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా రూపొందించిన కరపత్రాన్ని ఆయన ఆవిష్కరించారు. బీసీ కులాల అస్తిత్వాన్ని ప్రతిబింబించిన ఈ సంకలనం గత 25 ఏళ్లుగా ఎంతోమంది కవుల సృజనకు స్ఫూర్తినిచ్చిందన్నారు.
20న ‘బీసీ కలాల అలాయి బలాయి’
ఈ నెల 20న హైదరాబాద్‌లోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు ‘బీసీ కలాల అలాయి బలాయి’ కార్యక్రమం నిర్వహించనున్నట్లు తెలిపారు. బీసీ కవులు, కవయిత్రులు, రచయితలు, సామాజికవేత్తలు అధిక సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు. కార్యక్రమంలో ఆచార్య ఆర్.రత్నమంజుల, డాక్టర్ చెనగోని వెంకట్‌గౌడ్, డాక్టర్ డి.కిషన్, డాక్టర్ రాచమళ్ల శ్రీను, అద్దంకి ఆంజనేయులు, డి.కిరణ్ తదితరులు పాల్గొన్నారు.
















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్‌ను పోస్ట్ చేయండి