Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
(TUWJ–IJU) నూతన కమిటీ సభ్యులకు మున్సిపల్ చైర్మన్ ఘన సన్మానం హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన 80s AI ఫొటోల క్రేజ్.. షాకింగ్ నిజాలు! న్యాల్కల్‌లో శ్రావణ మాసం చివరి సోమవారం.. రామలింగేశ్వర ఆలయంలో భక్తుల రద్దీ అక్షరమే ఆయుధం… గురువే దారిచూపే దీపం! నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి రూ.30 వేల లంచం.. రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడితే ఇంట్లో రూ.4.27 కోట్ల కట్టలు! డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: September 15, 2026 05:12 PM

వినాయక మండపాల్లో ప్రత్యేక పూజలు.. పాల్గొన్న జగ్గారెడ్డి కుటుంబం

15-09-2026 37 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Krishna

సంగారెడ్డి పట్టణంలో వినాయక చవితి నవరాత్రి ఉత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి ఆధ్వర్యంలో పట్టణంలోని పలు ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన వినాయక మండపాల్లో తొలి రోజు పూజా కార్యక్రమాలు భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. రామ్‌నగర్‌లోని రామ్ మందిర్ వద్ద జగ్గారెడ్డి భక్తులతో కలిసి భజన చేస్తూ ఊరేగింపులో పాల్గొని, బ్రాహ్మణవాడ నుంచి మట్టి గణపతి విగ్రహాన్ని తీసుకువచ్చి మండపంలో ప్రతిష్ఠించారు. అనంతరం వివేకానంద యూత్ అసోసియేషన్, చైతన్య యువజన సంఘం, ఐబీ యూత్ కాంగ్రెస్, భరత్ సాయి రెడ్డి యువసేన ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వినాయక మండపాల్లో నిర్వహించిన ప్రత్యేక పూజల్లో జగ్గారెడ్డి కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. కార్యక్రమాల్లో జయారెడ్డి, గుణ చైతన్య రెడ్డి దంపతులు, భరత్ సాయి రెడ్డి, కాబోయే వధువు పాలక్ పటేల్, నిర్మలా జగ్గారెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా జగ్గారెడ్డి సంగారెడ్డి ప్రజలతో పాటు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల ప్రజలకు వినాయక చవితి శుభాకాంక్షలు తెలిపారు. విఘ్నేశ్వరుడి ఆశీస్సులతో ప్రజలందరూ సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో జీవించాలని ఆకాంక్షించారు.

Sthanikam

వినాయక మండపాల్లో ప్రత్యేక పూజలు.. పాల్గొన్న జగ్గారెడ్డి కుటుంబం

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News