దేవరకొండ: నల్లగొండ జిల్లా దేవరకొండలోని వైజాక్ కాలనీలో విషాద ఘటన చోటుచేసుకుంది. నీటిలో మునిగి హైదరాబాద్‌కు చెందిన 26 ఏళ్ల యువకుడు మృతి చెందాడు. మృతుడిని హైదరాబాద్ కాప్రాకు చెందిన జి.శ్రీకాంత్‌గా గుర్తించారు.
మల్కాజిగిరికి చెందిన ఏడుగురు స్నేహితులు సోమవారం వైజాక్ కాలనీకి వచ్చారు. ఈ క్రమంలో శ్రీకాంత్ నీటిలో మునిగిపోయాడు. అతడి కోసం ఎంత వెతికినా ఆచూకీ లభించకపోవడంతో గజ ఈతగాళ్ల సహాయంతో గాలింపు చేపట్టారు. చివరకు గజ ఈతగాళ్లు శివ తదితరుల సహాయంతో శ్రీకాంత్ మృతదేహాన్ని నీటి నుంచి వెలికితీశారు.
సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని వివరాలు సేకరించారు. ఘటనపై పూర్తిస్థాయిలో విచారణ అనంతరం పూర్తి వివరాలు వెల్లడిస్తామని స్థానిక ఎస్‌ఐ నాగేంద్రబాబు తెలిపారు.
శ్రీకాంత్‌తో పాటు వచ్చిన వారిలో ఆర్.వినయ్, కె.సాయిరేవంత్, ఆర్.మహేష్, కె.సాయి హేమంత్, పి.మణికంఠ, ఆర్.వినీత్ ఉన్నారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్‌ను పోస్ట్ చేయండి