పర్యావరణ పరిరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత అని లైన్స్ క్లబ్ రీజన్ చైర్మన్ రాజకుమార్, కార్యదర్శి చంద్రశేఖర్ ఆచార్య, అధ్యక్షుడు సాయి సంగమేశ్వర అన్నారు. నారాయణఖేడ్ పట్టణ కేంద్రంలో సోమవారం లైన్స్ క్లబ్ ఆధ్వర్యంలో మట్టి వినాయక విగ్రహాలను భక్తులకు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రతి పండుగలో ప్రకృతికి హాని కలిగించని వస్తువులను వినియోగించాలని సూచించారు. పంచభూతాలను కాలుష్యం చేయడం మానవ ప్రగతికి విరుద్ధమని, ప్రకృతిని కాపాడుకోవడం అందరి బాధ్యత అన్నారు. ప్రకృతి పరిరక్షణను ధ్యేయంగా చేసుకుని ప్రతి ఒక్కరూ పర్యావరణహిత పద్ధతులను పాటించాలని కోరారు. కార్యక్రమంలో లైన్స్ క్లబ్ కోశాధికారి పాండురంగ రెడ్డి, సభ్యులు రాజేశ్వర్, పరమేశ్వర్ తదితరులు పాల్గొన్నారు.
PRINT TIME: September 14, 2026 01:13 PM
పర్యావరణహిత వినాయకులే ముద్దు.. మట్టి విగ్రహాల పంపిణీ

14-09-2026
57 Views
స్థానికం ప్రతినిధి :
Sub Editor
Krishna
పర్యావరణ పరిరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత అని లైన్స్ క్లబ్ రీజన్ చైర్మన్ రాజకుమార్, కార్యదర్శి చంద్రశేఖర్ ఆచార్య, అధ్యక్షుడు సాయి సంగమేశ్వర అన్నారు. నారాయణఖేడ్ పట్టణ కేంద్రంలో సోమవారం లైన్స్ క్లబ్ ఆధ్వర్యంలో మట్టి వినాయక విగ్రహాలను భక్తులకు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రతి పండుగలో ప్రకృతికి హాని కలిగించని వస్తువులను వినియోగించాలని సూచించారు. పంచభూతాలను కాలుష్యం చేయడం మానవ ప్రగతికి విరుద్ధమని, ప్రకృతిని కాపాడుకోవడం అందరి బాధ్యత అన్నారు. ప్రకృతి పరిరక్షణను ధ్యేయంగా చేసుకుని ప్రతి ఒక్కరూ పర్యావరణహిత పద్ధతులను పాటించాలని కోరారు. కార్యక్రమంలో లైన్స్ క్లబ్ కోశాధికారి పాండురంగ రెడ్డి, సభ్యులు రాజేశ్వర్, పరమేశ్వర్ తదితరులు పాల్గొన్నారు.

పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్‌ను పోస్ట్ చేయండి