Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
12 వ వార్డులో ఉచిత మట్టి వినాయక విగ్రహాల పంపిణీ 80s AI ఫొటోల క్రేజ్.. షాకింగ్ నిజాలు! న్యాల్కల్‌లో శ్రావణ మాసం చివరి సోమవారం.. రామలింగేశ్వర ఆలయంలో భక్తుల రద్దీ అక్షరమే ఆయుధం… గురువే దారిచూపే దీపం! భవన నిర్మాణ కాంట్రాక్టర్‌–స్వంతదారుల మధ్య ఒప్పందం నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి రూ.30 వేల లంచం.. రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడితే ఇంట్లో రూ.4.27 కోట్ల కట్టలు! డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: September 13, 2026 09:25 PM

కార్మికోద్యమాలపై ప్రభుత్వ నిర్బంధాలకు వ్యతిరేకంగా సెప్టెంబర్ 16న సామూహిక దీక్షలు

13-09-2026 0 Views
Reporter
స్థానికం ప్రతినిధి : యాదాద్రి భువనగిరి జిల్లా స్టాఫ్ రిపోర్టర్
Sthanikam District Staff Reporter

సిఐటియు రాష్ట్ర ఉపాధ్యక్షులు జె.మల్లికార్జున్

యాదాద్రి భువనగిరి జిల్లా బ్యూరో: శ్రీనివాస్

కార్మిక హక్కుల కోసం పోరాడుతున్న కార్మికుల న్యాయమైన సమస్యలను పరిష్కరించాల్సింది పోయి,కార్మిక ఉద్యమాలపై ప్రభుత్వం అణచివేత చర్యలకు పాల్పడటం దారుణమని సీఐటీయూ (సిఐటియు) రాష్ట్ర ఉపాధ్యక్షులు జె.మల్లికార్జున్ మండిపడ్డారు.ఆదివారం రోజున స్థానిక సీఐటీయూ జిల్లా కార్యాలయంలో జిల్లా అధ్యక్షులు కోమటిరెడ్డి చంద్రారెడ్డి అధ్యక్షతన జరిగిన జిల్లా కమిటీ సమావేశంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ...రాష్ట్రంలో నిరసనలు తెలిపే హక్కును కాలరాస్తూ, అర్ధరాత్రి వేళ ముందస్తు అరెస్టులు చేయడం,'ధర్నా చౌక్' వద్ద అప్రకటిత నిషేధం అమలు చేయడం పోలీసుల అప్రజాస్వామిక చర్యలను అని విమర్శించారు. ఎన్నికల ముందు ఇచ్చిన ఆరు గ్యారంటీలు,ఇతర వాగ్దానాలను అమలు చేయాలని డిమాండ్ చేస్తున్న ఆశా,అంగన్‌వాడీ మరియు ఇతర రంగా కార్మికులపై దమనకాండ సాగించడం సరికాదని ఆయన స్పష్టం చేశారు. ఈ ప్రభుత్వ అణచివేత విధానాలు మరియు నిర్బంధాలకు నిరసనగా సెప్టెంబర్ 16న రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లా కేంద్రాల్లో సీఐటీయూ ఆధ్వర్యంలో నిర్వహించే సామూహిక నిరసన దీక్షలను జయప్రదం చేయాలని ఆయన పిలుపునిచ్చారు. గ్రామ పంచాయతీ కార్మికులకు కనిసవేతనం ఇవ్వాలని,ఆశా వర్కర్లకు రూ.18వేల ఫిక్స్డ్ వేతనం,అంగన్‌వాడీలకు ఉద్యోగ భద్రత,వేతన పెంపుతో పాటు ఆర్టీసీ,విద్యుత్,మున్సిపల్,కాంట్రాక్ట్,అవుట్‌సోర్సింగ్ కార్మికుల న్యాయమైన సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. ఈ సామూహిక నిరసన దీక్షల్లో అన్ని రంగాల కార్మికులు, నాయకులు పెద్ద ఎత్తున పాల్గొని కార్మిక శక్తిని తెలియజేయాలని జె.మల్లికార్జున్ పిలుపునిచ్చారు.ఈ సమావేశంలో సిఐటియు జిల్లా కార్యదర్శి కల్లూరి మల్లేశం,జిల్లా ఉపాధ్యక్షులు దాసరి పాండు,కోశాధికారి ఎండి.పాషా,జిల్లా ఉపాధ్యక్షులు మాయ కృష్ణ,గొరిగే సోములు,జిల్లా సహాయ కార్యదర్శులు తుర్కపల్లి సురేందర్,చెక్క రమేష్,నకిరేకంటి రాము,పొట్ట యాదమ్మ తదితరులు పాల్గొన్నారు.

Sthanikam

కార్మికోద్యమాలపై ప్రభుత్వ నిర్బంధాలకు వ్యతిరేకంగా సెప్టెంబర్ 16న సామూహిక దీక్షలు

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News