ఈ నెల 19న కోదాడలోని సీసీ రెడ్డి విద్యాలయ ప్రాంగణంలో నిర్వహించనున్న మెగా జాబ్‌మేళా ఏర్పాట్లను జిల్లా ఉన్నతాధికారులు ఆదివారం పరిశీలించారు. జాబ్‌మేళాకు హాజరయ్యే నిరుద్యోగ యువతకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా చేపట్టాల్సిన ఏర్పాట్లను పరిశీలించారు.ఈ సందర్భంగా జాబ్‌మేళా నిర్వహించే ప్రాంగణం, వాహనాల పార్కింగ్ కోసం కేటాయించిన స్థలాలు, భోజన వసతి ఏర్పాట్లు, తాగునీరు, టాయిలెట్లు తదితర మౌలిక సదుపాయాలను అధికారులు పరిశీలించారు. పెద్ద సంఖ్యలో అభ్యర్థులు హాజరయ్యే అవకాశం ఉన్నందున పార్కింగ్, ట్రాఫిక్ నియంత్రణ, భద్రతా ఏర్పాట్లపై ప్రత్యేక దృష్టి సారించాలని సూచించారు.ఈ పరిశీలనలో సూర్యాపేట జిల్లా కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్, జిల్లా ఎస్పీ నర్సింహ, కోదాడ డీఎస్పీ శ్రీనివాస్ రెడ్డి, టౌన్ సీఐ శివశంకర్ నాయక్, ఎస్సైలు, ఆర్డీఓ సూర్యనారాయణ, ఎంఆర్ఓ కిరణ్, స్పెషల్ బ్రాంచ్ ఎస్సై సైదులు తదితర అధికారులు పాల్గొన్నారు.
కోదాడ మెగా జాబ్ మేళా ఏర్పాట్ల పరిశీలన
కోదాడ మెగా జాబ్ మేళా ఏర్పాట్ల పరిశీలన
Harish reporter
ఈ నెల 19న కోదాడలోని సీసీ రెడ్డి విద్యాలయ ప్రాంగణంలో నిర్వహించనున్న మెగా జాబ్‌మేళా ఏర్పాట్లను జిల్లా ఉన్నతాధికారులు ఆదివారం పరిశీలించారు. జాబ్‌మేళాకు హాజరయ్యే నిరుద్యోగ యువతకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా చేపట్టాల్సిన ఏర్పాట్లను పరిశీలించారు.ఈ సందర్భంగా జాబ్‌మేళా నిర్వహించే ప్రాంగణం, వాహనాల పార్కింగ్ కోసం కేటాయించిన స్థలాలు, భోజన వసతి ఏర్పాట్లు, తాగునీరు, టాయిలెట్లు తదితర మౌలిక సదుపాయాలను అధికారులు పరిశీలించారు. పెద్ద సంఖ్యలో అభ్యర్థులు హాజరయ్యే అవకాశం ఉన్నందున పార్కింగ్, ట్రాఫిక్ నియంత్రణ, భద్రతా ఏర్పాట్లపై ప్రత్యేక దృష్టి సారించాలని సూచించారు.ఈ పరిశీలనలో సూర్యాపేట జిల్లా కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్, జిల్లా ఎస్పీ నర్సింహ, కోదాడ డీఎస్పీ శ్రీనివాస్ రెడ్డి, టౌన్ సీఐ శివశంకర్ నాయక్, ఎస్సైలు, ఆర్డీఓ సూర్యనారాయణ, ఎంఆర్ఓ కిరణ్, స్పెషల్ బ్రాంచ్ ఎస్సై సైదులు తదితర అధికారులు పాల్గొన్నారు.

పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్‌ను పోస్ట్ చేయండి