Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
మునుగోడు యువతకు ‘ఆసరా’గా మెగా ఉద్యోగ మేళా: 50 పైగా సంస్థలు, 3,000 ఖాళీలు 80s AI ఫొటోల క్రేజ్.. షాకింగ్ నిజాలు! న్యాల్కల్‌లో శ్రావణ మాసం చివరి సోమవారం.. రామలింగేశ్వర ఆలయంలో భక్తుల రద్దీ అక్షరమే ఆయుధం… గురువే దారిచూపే దీపం! భవన నిర్మాణ కాంట్రాక్టర్‌–స్వంతదారుల మధ్య ఒప్పందం నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి రూ.30 వేల లంచం.. రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడితే ఇంట్లో రూ.4.27 కోట్ల కట్టలు! డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: September 12, 2026 08:52 PM

రైల్వే అండర్ పాస్ కింద నీరు నిలవకుండా చర్యలు చేపట్టాలి: సీపీఐ(ఎం)

12-09-2026 7 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
K.RAVI

భువనగిరి పట్టణ పరిధిలోని 11వ వార్డు బొమ్మాయిపల్లి వద్ద నిర్మిస్తున్న రైల్వే అండర్ పాస్ కింద వర్షపు నీరు నిలవకుండా వెంటనే శాశ్వత పరిష్కారం చూపాలని సీపీఐ(ఎం) పట్టణ కార్యదర్శి మాయ కృష్ణ రైల్వే అధికారులను డిమాండ్ చేశారు. శనివారం ఆయన స్థానిక నాయకులతో కలిసి అండర్ పాస్ నిర్మాణ పనులను పరిశీలించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... కొత్త రైల్వే లైన్ నిర్మాణంలో భాగంగా నిర్మిస్తున్న అండర్ పాస్ కింద వర్షపు నీటితో పాటు పొలాల నుంచి వచ్చే నీరు చేరి కింది భాగం లోతుగా మారడంతో రాకపోకలు పూర్తిగా నిలిచిపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. వర్షం వస్తే ద్విచక్ర వాహనాలు, కార్లు, ట్రాక్టర్లు, పశువులు కూడా వెళ్లే పరిస్థితి లేదని పేర్కొన్నారు. గతంలో పాత బ్రిడ్జి పక్క నుంచి ఉన్న నీటి కాలువను పునరుద్ధరించి, వర్షపు నీరు సఫీగా పోయేలా చర్యలు తీసుకోవాలని కోరారు.అలాగే, సైడ్ గోడను తొలగించడంతో రైల్వే కట్ట మట్టి అంతా రోడ్డుపైకి కొట్టుకొచ్చి అండర్ పాస్ లోకి చేరుతోందని, వెంటనే రక్షణ గోడ (రిటైనింగ్ వాల్) నిర్మించాలని గ్రామస్తులు, రైతులు కోరుతున్నట్లు తెలిపారు. రైల్వే అధికారులు వెంటనే స్పందించి సమస్యను పరిష్కరించకపోతే సీపీఐ(ఎం) ఆధ్వర్యంలో గ్రామస్తులతో కలిసి పెద్ద ఎత్తున ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు.

​ఈ కార్యక్రమంలో సీపీఐ(ఎం) సీక్రెట్ సభ్యులు గంధమల్ల మాతయ్య, పర్వత్ బాలకృష్ణ, శాఖ కార్యదర్శి బండి రవి, బండి వెంకటేశం, గుండెబోయిన కృష్ణ, పర్వత్ ఎట్టయ్య, గాడిద నరసింహ, బండి మల్లేష్, చిలుకూరి మల్లారెడ్డి, కడారి మహేష్, పర్వత్ సురేష్, కడారి ఐలయ్య, దొడ్డి శేఖర్ తదితరులు పాల్గొన్నారు.

Sthanikam

రైల్వే అండర్ పాస్ కింద నీరు నిలవకుండా చర్యలు చేపట్టాలి: సీపీఐ(ఎం)

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News