Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
నారాయణఖేడ్‌లో లోక్ అదాలత్‌లో 574 కేసులకు శాశ్వత పరిష్కారం 80s AI ఫొటోల క్రేజ్.. షాకింగ్ నిజాలు! న్యాల్కల్‌లో శ్రావణ మాసం చివరి సోమవారం.. రామలింగేశ్వర ఆలయంలో భక్తుల రద్దీ అక్షరమే ఆయుధం… గురువే దారిచూపే దీపం! భవన నిర్మాణ కాంట్రాక్టర్‌–స్వంతదారుల మధ్య ఒప్పందం నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి రూ.30 వేల లంచం.. రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడితే ఇంట్లో రూ.4.27 కోట్ల కట్టలు! డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: September 12, 2026 07:04 PM

విశాల భారతి పాఠశాల లో ఘనంగా 'గ్రాండ్ పేరెంట్స్ డే'

12-09-2026 13 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
K.RAVI

తాతయ్యలు, అమ్మమ్మల ఆశీస్సులు తీసుకున్న విద్యార్థులు

సంస్కృతి, సాంప్రదాయాలను కాపాడుకోవాలి: కరస్పాండెంట్ చైతన్యక్రాంతి వర్ధన్ రెడ్డి

స్థానిక విశాల భారతి హైస్కూల్ ఆవరణలో శనివారం గ్రాండ్ పేరెంట్స్ డే వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులు తమ తాతయ్యలు, నానమ్మలు, అమ్మమ్మలకు భక్తిశ్రద్ధలతో పాదపూజలు చేసి వారి ఆశీస్సులు అందుకున్నారు. పెద్దల ఆశీర్వచనాలు పొందడం పిల్లలు చేసుకున్న పూర్వజన్మ సుకృతమని నిర్వాహకులు పేర్కొన్నారు. ​కార్యక్రమంలో పాఠశాల కరస్పాండెంట్ వీసం చైతన్యక్రాంతి వర్ధన్ రెడ్డి మాట్లాడుతూ... పిల్లలకు చిన్ననాటి నుంచే నైతిక విలువలు, భారతీయ సంస్కృతీ సాంప్రదాయాలు నేర్పించడంలో తాతముత్తాతల పాత్ర కీలకమైనదన్నారు. నేటి ఆధునిక కాలంలో పాఠశాల ప్రాంగణంలో ఇలాంటి సాంప్రదాయ పూజా కార్యక్రమాలు నిర్వహించడం అభినందనీయమన్నారు. ఈ వేడుకల్లో పాఠశాల ప్రిన్సిపల్ ముత్యం శ్రీనివాస్, విద్యార్థుల తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు, పెద్ద సంఖ్యలో తాతయ్యలు, అమ్మమ్మలు పాల్గొన్నారు.

Sthanikam

విశాల భారతి పాఠశాల లో ఘనంగా 'గ్రాండ్ పేరెంట్స్ డే'

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News