నల్గొండ: సీతారాం ఏచూరి ఆశయాలను ముందుకు తీసుకెళ్లేందుకు ప్రజా సమస్యలపై నిరంతరం పోరాటాలు కొనసాగించాలని సీపీఎం నాయకులు పిలుపునిచ్చారు. సీపీఐ(ఎం) అఖిలభారత మాజీ ప్రధాన కార్యదర్శి, ప్రముఖ కమ్యూనిస్టు నాయకుడు సీతారాం ఏచూరి ద్వితీయ వర్ధంతి సందర్భంగా శుక్రవారం నల్గొండ మండలం జీకే అన్నారం గ్రామంలో సీపీఎం ఆధ్వర్యంలో ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు.
ఈ సందర్భంగా సీపీఎం సభ్యురాలు కొండ అనురాధ మాట్లాడుతూ.. కార్మికులు, కర్షకులు, పేదలు, సామాన్య ప్రజల హక్కుల కోసం ఏచూరి జీవితాంతం పోరాడారని తెలిపారు. దేశంలో లౌకికవాదం, ప్రజాస్వామ్యం, సామాజిక న్యాయం కోసం ఆయన చేసిన కృషి చిరస్మరణీయమన్నారు. మతోన్మాదం, కార్పొరేట్ అనుకూల విధానాలకు వ్యతిరేకంగా విశాల ప్రజా ఐక్యతను నిర్మించడంలో ఏచూరి కీలక పాత్ర పోషించారని పేర్కొన్నారు.
కార్మికులు, రైతులు, వ్యవసాయ కార్మికులు, యువత, మహిళలు, విద్యార్థుల సమస్యలపై పోరాటాలను మరింత ఉధృతం చేయడమే ఏచూరికి నిజమైన నివాళి అని అన్నారు. ప్రజాస్వామ్యం, లౌకికవాదం, సామాజిక న్యాయం, సమానత్వం కోసం ఐక్యంగా ఉద్యమించాలని పిలుపునిచ్చారు.
కార్యక్రమంలో సీపీఎం మండల నాయకులు కొండా వెంకన్న, నల్పరాజు మధు, భాగ్యము, కొండ రాములు, సిద్ధు, రామ్, లక్ష్మణ్, వరుణ్, లాదర్, వర్మ, లక్ష్మమ్మ, పార్వతమ్మ, మనీ తదితరులు పాల్గొన్నారు

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్‌ను పోస్ట్ చేయండి