ఈ నెల 19న లక్కారం వి.వి.ఆర్ గార్డెన్ లో ‘మెగా జాబ్ మేళా’
నిరుద్యోగ యువత మెగా జాబ్ మేళాను సద్వినియోగం చేసుకోవాలని ఇ ఎల్ వి భాస్కర్ ఫౌండేషన్ ఛైర్మన్ ఇరుగదిండ్ల భాస్కర్ అన్నారు. శనివారం అయన ఒక ప్రకటనలో మాట్లాడుతూ మండల పరిధిలోని లక్కారం లోని వివిఆర్ గార్డెన్స్ లో ఇఎల్ వి భాస్కర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఈ నెల 19న "మెగా జాబ్ మేళా" నిర్వహిస్తున్నామని తెలిపారు. ఉదయం 8:00 గంటల నుండి మధ్యాహ్నం 1:00 గంట వరకు ఈ మేళా జరుగుతుందన్నారు. ఈ జాబ్ మేళాకు 70కి పైగా ప్రముఖ కంపెనీలు హాజరై అభ్యర్థులకు నేరుగా ఇంటర్వ్యూలు నిర్వహించి ఎంపిక చేయనున్నాయని తెలిపారు. 10వ తరగతి, ఇంటర్మీడియట్, ఐటీఐ, డిప్లొమా, డిగ్రీ, పీజీ, బీటెక్, ఫార్మసీ వంటి ఏ విద్యార్హత కలిగిన యువత హాజరు కావాలని కోరారు. అభ్యర్థులకు ప్రవేశం పూర్తిగా ఉచితమని, ఆసక్తి ఉన్నవారు రిజిస్ట్రేషన్ చేసుకోవాలని సూచించారు. మరిన్ని వివరాలకు 95508 43338 నంబర్‌ను సంప్రదించాలని పేర్కొన్నారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్‌ను పోస్ట్ చేయండి