గుర్తుతెలియని వాహనాన్ని ఢీకొన్న కారు.. తాత, మనవడికి తీవ్ర గాయాలు.
కట్టంగూరు: ముందు వెళ్తున్న గుర్తుతెలియని వాహనాన్ని కారు బలంగా ఢీకొట్టిన ఘటనలో తాత, మనవడు తీవ్రంగా గాయపడ్డారు. ఈ ప్రమాదం నల్లగొండ జిల్లా కట్టంగూరు మండలం ఐటీపాముల వద్ద చోటుచేసుకుంది.
మియాపూర్‌కు చెందిన విశ్వేశ్వరరావు (50), జైకర్ (25) నందిగామ నుంచి హైదరాబాద్‌కు కారులో వెళ్తుండగా.. ఐటీపాముల వద్ద ముందు వెళ్తున్న గుర్తుతెలియని వాహనాన్ని వారి కారు బలంగా ఢీకొట్టింది. దీంతో కారు తీవ్రంగా దెబ్బతినడంతో ఇద్దరూ అందులోనే చిక్కుకుపోయారు.
సమాచారం అందుకున్న కట్టంగూరు పోలీసులు, 108 అంబులెన్స్ సిబ్బంది వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్నారు. తీవ్రంగా శ్రమించి కారులో చిక్కుకున్న ఇద్దరినీ బయటకు తీశారు. 108 అంబులెన్స్ పైలట్ మహేష్, ఈఎంటీ శ్రీనివాస్ క్షతగాత్రులకు ప్రాథమిక చికిత్స అందించి హుటాహుటిన నల్లగొండ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. గాయపడిన ఇద్దరూ తాత, మనవడిగా గుర్తించారు. ఘటనపై కట్టంగూరు పోలీసులు వివరాలు సేకరిస్తున్నారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్‌ను పోస్ట్ చేయండి