Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
బాలెంల స్టేజ్ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం ప్రజాపాలనకు ఆయువుపట్టు: 'సమాచార హక్కు చట్టం - 2005' సుదీర్ఘ ప్రస్థానం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 16, 2026 01:34 PM

చిట్యాలలో కృష్ణాష్టమి, బోనాల పండుగల తేదీలు ఖరారు

29-08-2026 224 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Komidala Mahender reddy

సెప్టెంబర్ 4న ఉట్ల పండుగ.. 6న గ్రామదేవతలకు ఊరందరి బోనాలు.

చిట్యాల, ఆగస్టు 29: చిట్యాల పురపాలక సంఘం పరిధిలో శ్రీ కృష్ణాష్టమి, బోనాల పండుగలను ఘనంగా నిర్వహించేందుకు తేదీలు ఖరారయ్యాయి. ఈ మేరకు శనివారం చిట్యాల పురపాలక సంఘం కార్యాలయంలో చైర్‌పర్సన్ అధ్యక్షతన, దౌలతాబాద్ వాసు దేవ శర్మ ఆధ్వర్యంలో అఖిలపక్ష సమావేశం నిర్వహించారు.

ఈ సమావేశంలో సెప్టెంబర్ 4వ తేదీ శుక్రవారం శ్రీ కృష్ణాష్టమి (ఉట్ల పండుగ)ను నిర్వహించాలని నిర్ణయించారు. అలాగే సెప్టెంబర్ 6వ తేదీ ఆదివారం గ్రామదేవతలకు ఊరందరి బోనాలు సమర్పించేందుకు తేదీని ఖరారు చేశారు.

పట్టణ ప్రజలందరూ కృష్ణాష్టమి, బోనాల పండుగలను భక్తిశ్రద్ధలతో, ఆనందోత్సాహాలతో ఘనంగా నిర్వహించుకోవాలని సమావేశంలో పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో అఖిలపక్ష నాయకులు, పురపాలక సంఘ కౌన్సిల్ సభ్యులు, గ్రామ పెద్దలు తదితరులు పాల్గొన్నారు.

Sthanikam

చిట్యాలలో కృష్ణాష్టమి, బోనాల పండుగల తేదీలు ఖరారు

Article Image

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News