Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
కురుమర్తిలో 100 ఎకరాల్లో ఎండిన పంటలు! ప్రజాపాలనకు ఆయువుపట్టు: 'సమాచార హక్కు చట్టం - 2005' సుదీర్ఘ ప్రస్థానం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 15, 2026 01:21 PM

యువతలో డ్రగ్స్‌పై చైతన్యం అభినందనీయం

యువతలో డ్రగ్స్‌పై చైతన్యం అభినందనీయం

యువతలో డ్రగ్స్‌పై చైతన్యం అభినందనీయం
29-08-2026 60 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

చిట్యాల, ఆగస్టు 29:

‘సే నో టు డ్రగ్స్‌ – సే నో టు గంజాయి’ నినాదంతో యువతను మత్తు పదార్థాలకు దూరంగా ఉంచేందుకు సికింద్రాబాద్‌ నుంచి వైజాగ్‌ వరకు పాదయాత్ర చేపడుతున్న సోషల్‌ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్‌ ఇమ్రాన్‌ ప్రిన్స్‌, ఆయన బృందాన్ని డీవైఎఫ్‌ఐ తెలంగాణ రాష్ట్ర కమిటీ అభినందించింది. శనివారం చిట్యాల మండలం వేలిమినేడు గ్రామం సమీపంలోని జాతీయ రహదారి వద్ద పాదయాత్ర బృందాన్ని డీవైఎఫ్‌ఐ రాష్ట్ర ఉపాధ్యక్షుడు మల్లం మహేష్‌ కలిసి అభినందించారు.

ఈ సందర్భంగా మల్లం మహేష్‌ మాట్లాడుతూ.. డ్రగ్స్‌, గంజాయి వంటి మత్తు పదార్థాలకు యువత ఆకర్షితులు కాకుండా చైతన్యం తీసుకురావాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందన్నారు. యువతను మత్తు పదార్థాలకు దూరంగా ఉంచి క్రీడలు, విద్య, ఉపాధి, సామాజిక కార్యక్రమాల వైపు నడిపించేందుకు ఇలాంటి అవగాహన కార్యక్రమాలు దోహదపడతాయని తెలిపారు.

గంజాయి, డ్రగ్స్‌కు వ్యతిరేకంగా డీవైఎఫ్‌ఐ ఆధ్వర్యంలో ఇప్పటికే సైకిల్‌ యాత్రలు, అవగాహన సదస్సులు, క్రీడా కార్యక్రమాలు నిర్వహించినట్లు చెప్పారు. యువత ఆరోగ్యకరమైన జీవన విధానం వైపు నడిచేలా మరిన్ని కార్యక్రమాలు కొనసాగిస్తామని తెలిపారు.

అదేవిధంగా గంజాయి, డ్రగ్స్‌కు వ్యతిరేకంగా రూపొందించిన ‘గ్యాంగ్స్‌ ఆఫ్‌ సికింద్రాబాద్‌’ సినిమాను అభినందించారు. సమాజంలోని వాస్తవ పరిస్థితులను ప్రతిబింబిస్తూ యువతకు సందేశం ఇచ్చే సినిమాలు మరిన్ని రావాల్సిన అవసరం ఉందన్నారు. దసరా సందర్భంగా విడుదల కానున్న ఈ సినిమా విజయవంతం కావాలని ఆకాంక్షించారు.

కార్యక్రమంలో డీవైఎఫ్‌ఐ మండల కార్యదర్శి కూనూరు గణేష్‌, గ్రామ శాఖ అధ్యక్షుడు మేడి మనోజ్‌, కూరాకుల శివశంకర్‌, నాయకులు నూతనకంటి లింగస్వామి, దండు వివేక్‌, శివ తదితరులు పాల్గొన్నారు.

Sthanikam

యువతలో డ్రగ్స్‌పై చైతన్యం అభినందనీయం

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News