నల్లగొండ: పట్టణంలో గంజాయి విక్రయిస్తూ, మోటార్‌సైకిళ్ల దొంగతనాలకు పాల్పడుతున్న ఐదుగురు నిందితులను నల్లగొండ II టౌన్ పోలీసులు అరెస్ట్ చేశారు. వారి వద్ద నుంచి 2.5 కిలోల గంజాయి, నాలుగు మోటార్‌సైకిళ్లు, ఐదు సెల్‌ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. మరో నిందితుడు పరారీలో ఉన్నాడు.
ఒడిశా రాష్ట్రంలోని పసుపులంక ప్రాంతం నుంచి గంజాయిని తీసుకొచ్చి నల్లగొండలో చిన్న ప్యాకెట్లుగా విక్రయిస్తున్నట్లు విచారణలో వెల్లడైంది. గంజాయి కొనుగోలుకు డబ్బులు లేకపోవడంతో దొంగిలించిన బైక్‌ను కుదువ పెట్టి గంజాయి కొనుగోలు చేసినట్లు పోలీసులు తెలిపారు. నిందితులు నల్లగొండతో పాటు హైదరాబాద్‌లో పలువురు వాహనాలను దొంగిలించినట్లు గుర్తించారు.
ఈ కేసును డీఎస్పీ కె. శివరాం రెడ్డి పర్యవేక్షణలో సీఐ కె. ఆది రెడ్డి ఆధ్వర్యంలో దర్యాప్తు చేస్తున్నారు. నిందితులను పట్టుకోవడంలో కీలకంగా వ్యవహరించిన ఎస్సైలు డి. సైద బాబు, అహ్మద్ షరీఫ్, సిబ్బందిని జిల్లా ఎస్పీ అభినందించారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్‌ను పోస్ట్ చేయండి