Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
అర్హులందరికీ సంక్షేమ పథకాల ఫలాలు అందించాలి. మార్కెట్‌ కమిటీ చైర్‌పర్సన్‌ రేఖ బాబురావు. ప్రజాపాలనకు ఆయువుపట్టు: 'సమాచార హక్కు చట్టం - 2005' సుదీర్ఘ ప్రస్థానం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 15, 2026 12:25 PM

మత్తు పదార్థాలకు పిల్లలను దూరంగా ఉంచాలి

మత్తు పదార్థాలకు పిల్లలను దూరంగా ఉంచాలి

మత్తు పదార్థాలకు పిల్లలను దూరంగా ఉంచాలి
28-08-2026 30 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
K.RAVI

పాఠశాలలో పోక్సో, గుడ్ టచ్ - బ్యాడ్ టచ్‌పై అవగాహన

విద్యార్థులు సమాజంలో పెరుగుతున్న మత్తు పదార్థాల సంస్కృతికి ఆకర్షితులు కాకుండా చదువుపైనే దృష్టి సారించాలని జిల్లా బాలల పరిరక్షణ విభాగం (డీసీపీయూ) సోషల్ వర్కర్ ఎం. మత్స్యగిరి సూచించారు.

​మండలంలోని తంగడపల్లి జెడ్పీహెచ్ఎస్ పాఠశాలలో గురువారం డీసీపీయూ, జస్ట్ రైట్స్ చిల్డ్రన్ & స్కోప్ స్వచ్ఛంద సంస్థల ఆధ్వర్యంలో ‘గుడ్ టచ్ - బ్యాడ్ టచ్’, పోక్సో చట్టాలపై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, పిల్లలపై లైంగిక వేధింపులు, అత్యాచారాలకు పాల్పడే వారిపై పోక్సో కింద తీవ్ర శిక్షలు ఉంటాయని తెలిపారు. ఆపద సమయాల్లో చైల్డ్ హెల్ప్‌లైన్ 1098 లేదా 112 నంబర్లకు ఫిర్యాదు చేయవచ్చని, వివరాలు గోప్యంగా ఉంచుతామని వివరించారు.

​అనంతరం టోల్ ఫ్రీ నంబర్ల పోస్టర్లను ఆవిష్కరించి, బాల్య వివాహాల నిర్మూలనపై విద్యార్థులతో ప్రతిజ్ఞ చేయించారు. కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయురాలు డి. భార్గవి, స్వచ్ఛంద సంస్థ ప్రతినిధి బి. నరసింహరాజు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

Sthanikam

మత్తు పదార్థాలకు పిల్లలను దూరంగా ఉంచాలి

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News