Sthanikam - Truth Matters
Logo
Home / ప్రాంతీయ వార్తలు / యాదాద్రి భువనగిరి

పోలీసులకు రాఖీలు కట్టిన విద్యార్థులు

Updated : 27 Aug 2026 16:42 IST
As Preferred Source 1 min read
పోలీసులకు రాఖీలు కట్టిన విద్యార్థులు

రక్షాబంధన్ వేడుకలను పురస్కరించుకుని చౌటుప్పల్ మండల కేంద్రంలో నలంద కళాశాల విద్యార్థులు గురువారం శాంతిభద్రతల పరిరక్షకులకు రాఖీలు కట్టి తమ అభిమానాన్ని చాటుకున్నారు. ఎస్‌ఎఫ్‌ఐ ఆధ్వర్యంలో స్థానిక పోలీస్ స్టేషన్‌ను సందర్శించిన విద్యార్థులు, పండుగ శుభాకాంక్షలు తెలుపుతూ పోలీసు అధికారులకు, సిబ్బందికి రాఖీలు కట్టారు.ఈ సందర్భంగా చౌటుప్పల్ ఎస్‌హెచ్‌ఓ, ఇన్‌స్పెక్టర్ జి. మన్మధ కుమార్, ఎస్‌ఐలు కే. యాదగిరి, కృష్ణమాల్, రవీందర్, అజయ్ భార్గవ్‌లతో పాటు ఇతర పోలీస్ సిబ్బందికి విద్యార్థినులు రాఖీలు కట్టారు. అనంతరం విద్యార్థులు మాట్లాడుతూ... రాత్రింబవళ్ళు ప్రజా రక్షణ, సమాజంలో శాంతిభద్రతల పరిరక్షణే ధ్యేయంగా శ్రమిస్తున్న పోలీసుల సేవలు అభినందనీయమన్నారు. రక్షాబంధన్ సోదరభావానికి, ఆత్మీయతకు ప్రతీక అని పేర్కొన్నారు. ​ఈ సందర్భంగా పోలీస్ అధికారులు విద్యార్థులకు రాఖీ శుభాకాంక్షలు తెలిపారు. విద్యార్థులు చదువులో క్రమశిక్షణ పాటిస్తూ ఉన్నత లక్ష్యాలను సాధించి సమాజానికి సేవ చేయాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమం విద్యార్థులు, పోలీసు శాఖ మధ్య స్నేహపూర్వక వాతావరణాన్ని, నమ్మకాన్ని మరింత బలోపేతం చేసిందని సీఐ మన్మధ కుమార్ వ్యాఖ్యానించారు. ఈ వేడుకల్లో కళాశాల విద్యార్థులు, ఎస్‌ఎఫ్‌ఐ ప్రతినిధులు పాల్గొన్నారు.

Sthanikam

పోలీసులకు రాఖీలు కట్టిన విద్యార్థులు

Article Image

మరిన్ని

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Latest news