Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
బాలెంల స్టేజ్ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం ప్రజాపాలనకు ఆయువుపట్టు: 'సమాచార హక్కు చట్టం - 2005' సుదీర్ఘ ప్రస్థానం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 16, 2026 02:35 PM

గట్ లింగంపల్లిలో కొనసాగుతున్న భూ రీ-సర్వే పనులను పరిశీలించిన: జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్

27-08-2026 104 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Krishna

నారాయణఖేడ్ నియోజకవర్గం మానూర్ మండల పరిధిలోని గట్ లింగంపల్లి గ్రామంలో కొనసాగుతున్న భూ రీ-సర్వే పనులను గురువారం సంబంధించిన అధికారులతో కలిసి జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్ పరిశీలించారు. గ్రామంలో చేపడుతున్న భూముల కొలతలు, హద్దుల నిర్ధారణ, భూ వివరాల నమోదు తదితర ప్రక్రియలను కలెక్టర్ క్షేత్రస్థాయిలో పరిశీలించి అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. రీ-సర్వే పనులను ఎలాంటి తప్పిదాలకు తావులేకుండా, పారదర్శకంగా మరియు నిబంధనల ప్రకారం పూర్తి చేయాలని అధికారులకు సూచించారు. భూ యజమానులకు ఇబ్బందులు కలగకుండా వారి సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరించాలని ఆదేశించారు.ఈ సందర్భంగా నారాయణఖేడ్ సబ్ కలెక్టర్ ఉమా హారతి, డిప్యూటీ కలెక్టర్ ప్రతిభ శేఖర్, సర్వే ల్యాండ్ ఏడీ, మానూర్ తహసీల్దార్ విష్ణు సాగర్, ఆర్‌ఐ శంకర్ రెడ్డి, సర్వేయర్ సుమలత,జూనియర్ అసిస్టెంట్ ఖాజా మొయినుద్దీన్,ఉప సర్పంచ్‌తో పాటు గ్రామ ప్రజలు పాల్గొన్నారు. గ్రామంలో భూ రీ-సర్వే ప్రక్రియను సజావుగా పూర్తి చేసేందుకు అధికారులు, సిబ్బంది సమన్వయంతో పనిచేస్తున్నట్లు తెలిపారు.

Sthanikam

గట్ లింగంపల్లిలో కొనసాగుతున్న భూ రీ-సర్వే పనులను పరిశీలించిన: జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్

Article Image

నారాయణఖేడ్ నియోజకవర్గం మానూర్ మండల పరిధిలోని గట్ లింగంపల్లి గ్రామంలో కొనసాగుతున్న భూ రీ-సర్వే పనులను గురువారం సంబంధించిన అధికారులతో కలిసి జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్ పరిశీలించారు. గ్రామంలో చేపడుతున్న భూముల కొలతలు, హద్దుల నిర్ధారణ, భూ వివరాల నమోదు తదితర ప్రక్రియలను కలెక్టర్ క్షేత్రస్థాయిలో పరిశీలించి అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. రీ-సర్వే పనులను ఎలాంటి తప్పిదాలకు తావులేకుండా, పారదర్శకంగా మరియు నిబంధనల ప్రకారం పూర్తి చేయాలని అధికారులకు సూచించారు. భూ యజమానులకు ఇబ్బందులు కలగకుండా వారి సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరించాలని ఆదేశించారు.ఈ సందర్భంగా నారాయణఖేడ్ సబ్ కలెక్టర్ ఉమా హారతి, డిప్యూటీ కలెక్టర్ ప్రతిభ శేఖర్, సర్వే ల్యాండ్ ఏడీ, మానూర్ తహసీల్దార్ విష్ణు సాగర్, ఆర్‌ఐ శంకర్ రెడ్డి, సర్వేయర్ సుమలత,జూనియర్ అసిస్టెంట్ ఖాజా మొయినుద్దీన్,ఉప సర్పంచ్‌తో పాటు గ్రామ ప్రజలు పాల్గొన్నారు. గ్రామంలో భూ రీ-సర్వే ప్రక్రియను సజావుగా పూర్తి చేసేందుకు అధికారులు, సిబ్బంది సమన్వయంతో పనిచేస్తున్నట్లు తెలిపారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News