రహదారి భద్రతా నియమాలను పాటిస్తూ బాధ్యతాయుతంగా వాహనాలు నడపాలని చౌటుప్పల్ ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ వెంకటేష్ సూచించారు. జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు బుధవారం లింగోజిగూడెం సమీపంలోని శ్రీని ఫార్మా పరిశ్రమ ప్రాంగణంలో సంస్థ ఉద్యోగులకు, కార్మికులకు 'రోడ్డు భద్రత - ట్రాఫిక్ నిబంధనలపై అవగాహన' కార్యక్రమాన్ని నిర్వహించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... నిబంధనలు ఉల్లంఘించడం వల్లే ఎక్కువ భాగం రహదారి ప్రమాదాలు జరుగుతున్నాయని అన్నారు. ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా ట్రాఫిక్ నియమాలు పాటించాలని, ద్విచక్ర వాహనదారులు హెల్మెట్, ఫోర్ వీలర్ డ్రైవర్లు సీట్ బెల్ట్ ధరించడం అలవాటు చేసుకోవాలని తెలిపారు. మద్యం తాగి వాహనాలు నడపడం, పరిమితికి మించిన వేగంతో వెళ్లడం వల్ల జరిగే నష్టాలను ఉద్యోగులకు వివరించారు. ఈ కార్యక్రమంలో శ్రీని ఫార్మా సంస్థ ప్రతినిధులు, సిబ్బంది, ట్రాఫిక్ పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.
రోడ్డు భద్రత ప్రతి ఒక్కరి బాధ్యత: చౌటుప్పల్ ట్రాఫిక్ సి.ఐ. వెంకటేష్

K.RAVI

పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్‌ను పోస్ట్ చేయండి