Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
అర్హులందరికీ సంక్షేమ పథకాల ఫలాలు అందించాలి. మార్కెట్‌ కమిటీ చైర్‌పర్సన్‌ రేఖ బాబురావు. ప్రజాపాలనకు ఆయువుపట్టు: 'సమాచార హక్కు చట్టం - 2005' సుదీర్ఘ ప్రస్థానం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 15, 2026 12:25 PM

దోరకుంట వద్ద ఘోర రోడ్డు ప్రమాదం

దోరకుంట వద్ద ఘోర రోడ్డు ప్రమాదం

దోరకుంట వద్ద ఘోర రోడ్డు ప్రమాదం
26-08-2026 35 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Kodada Reporter
Harish reporter

మంత్రి ఉత్తమ్, ఎమ్మెల్యే పద్మావతి రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి

మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి

క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని అధికారులకు ఆదేశం

సూర్యాపేట జిల్లా కోదాడ మండలం దోరకుంట సమీపంలోని హైదరాబాద్–విజయవాడ జాతీయ రహదారిపై బుధవారం తెల్లవారుజామున జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంపై రాష్ట్ర నీటిపారుదల,పౌర సరఫరాల శాఖామంత్రి కెప్టెన్ ఎన్. ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోదాడ ఎమ్మెల్యే ఎన్. పద్మావతి రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.కంటైనర్‌ను ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు ఢీకొన్న ఘటనలో ప్రాణనష్టం సంభవించడం అత్యంత విషాదకరమని పేర్కొన్నారు. గమ్యస్థానాలకు చేరుకోవాల్సిన ప్రయాణికుల జీవితాలు మార్గమధ్యంలోనే విషాదాంతం కావడం హృదయవిదారకమని ఆవేదన వ్యక్తం చేశారు.ఈ దుర్ఘటనలో ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబ సభ్యులకు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, ఎమ్మెల్యే పద్మావతి రెడ్డి ప్రగాఢ సానుభూతి, సంతాపాన్ని తెలియజేశారు. తమ ఆత్మీయులను కోల్పోయిన కుటుంబాలకు ఈ అపార విషాదాన్ని తట్టుకునే మనోధైర్యాన్ని భగవంతుడు ప్రసాదించాలని ఆకాంక్షించారు. ప్రమాదంలో గాయపడిన ప్రతి ఒక్కరికీ సకాలంలో అత్యుత్తమ వైద్య సేవలు అందేలా అన్ని చర్యలు చేపట్టాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. క్షతగాత్రుల ఆరోగ్య పరిస్థితిని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ, చికిత్స విషయంలో ఎలాంటి లోటుపాట్లకు తావులేకుండా చూడాలని సూచించారు. క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, ఎమ్మెల్యే పద్మావతి రెడ్డి ఆకాంక్షించారు.

Sthanikam

దోరకుంట వద్ద ఘోర రోడ్డు ప్రమాదం

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News