Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
బాలెంల స్టేజ్ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం ప్రజాపాలనకు ఆయువుపట్టు: 'సమాచార హక్కు చట్టం - 2005' సుదీర్ఘ ప్రస్థానం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 16, 2026 02:30 PM

కంటైనర్‌ను ఢీకొన్న ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు.. ఆరుగురు మృతి

26-08-2026 77 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Komidala Mahender reddy

కోదాడ సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం.. 42 మందితో వెళ్తుండగా విషాదం.

సూర్యాపేట జిల్లా కోదాడ మండలం దొరకుంట సమీపంలో బుధవారం తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. కంటైనర్‌ను వెనుక నుంచి ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు ఢీకొట్టడంతో ఈ ప్రమాదం జరిగింది.

ఈ ఘటనలో బస్సులో ప్రయాణిస్తున్న ఆరుగురు మృతి చెందగా.. పలువురు తీవ్రంగా గాయపడినట్లు సమాచారం.

హైదరాబాద్‌ నుంచి విజయవాడ వైపు వెళ్తున్న ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులో ప్రమాద సమయంలో మొత్తం 42 మంది ప్రయాణికులు ఉన్నారు. దొరకుంట సమీపంలో ముందు వెళ్తున్న కంటైనర్‌ను బస్సు వెనుక నుంచి బలంగా ఢీకొట్టడంతో ప్రమాద తీవ్రత అధికంగా ఉన్నట్లు తెలుస్తోంది.

ప్రమాద సమాచారం అందుకున్న పోలీసులు, స్థానికులు వెంటనే సహాయక చర్యలు చేపట్టారు. తీవ్రంగా గాయపడిన వారిని చికిత్స నిమిత్తం కోదాడ ఏరియా ఆస్పత్రికి తరలించారు. మృతుల వివరాలు, ప్రమాదానికి గల పూర్తి కారణాలు తెలియాల్సి ఉంది. ఘటనపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Sthanikam

కంటైనర్‌ను ఢీకొన్న ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు.. ఆరుగురు మృతి

Article Image

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News