Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
మొక్కలు నాటుతూ పర్యావరణ పరిరక్షణకు పిలుపు:గ్రామ సర్పంచ్ ప్రియాంక రాజేందర్ అధికారులారా.. మాదాహార్తిని తీర్చండి జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా మట్టి వాసనలో మన సంస్కృతి.. జానపద కళల్లో తరతరాల జీవన గాథ హెచ్ఆర్పీఎం సంస్థ ఉమెన్ సెల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా :- పండ్ల లక్ష్మీదేవి న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 25, 2026 09:25 PM

నల్గొండ జీజీహెచ్ లో ఉద్రిక్తత నర్సింగ్ ఆఫీసర్ల ఆందోళన

25-08-2026 55 Views
Reporter
స్థానికం ప్రతినిధి : District Bureau Nalagonda
NM Yadav

డిప్యూటీ సూపరింటెండెంట్‌పై తీవ్ర ఆరోపణలు...

నల్లగొండ: నల్లగొండ ప్రభుత్వ సర్వజన వైద్యశాల (జీజీహెచ్)లో నర్సింగ్ సిబ్బంది, వైద్యుల మధ్య వివాదం తీవ్రరూపం దాల్చింది. డిప్యూటీ సూపరింటెండెంట్ డాక్టర్ నాగేశ్ ప్రవర్తనపై, ఆసుపత్రిలోని మౌలిక వసతుల లేమిపై నర్సింగ్ ఆఫీసర్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఆందోళన బాట పట్టారు.

అనుచిత వ్యాఖ్యలు.. మానసిక వేధింపులు...

డిప్యూటీ సూపరింటెండెంట్ డాక్టర్ నాగేశ్ గత నాలుగేళ్లుగా నర్సింగ్ సిబ్బందితో అత్యంత దారుణంగా ప్రవర్తిస్తున్నారని బాధితులు ఆరోపించారు. విధుల పట్ల అంకితభావంతో పనిచేస్తున్నప్పటికీ, ఏకవచనంతో పిలవడం, ‘రావే.. పోవే..’ అంటూ అన్ పార్లమెంటరీ భాష ఉపయోగిస్తూ మానసికంగా వేధింపులకు గురిచేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కేవలం ఈ ఒక్క నెలలోనే 14 మంది మహిళా నర్సింగ్ ఆఫీసర్లకు ఆమోదయోగ్యం కాని రీతిలో మెమోలు జారీ చేయడంపై సిబ్బంది మండిపడ్డారు.

మౌలిక సదుపాయాల లేమి నర్సులపైనే నెపం...

ఆసుపత్రిలో కనీస వసతులు కరువయ్యాయని నర్సింగ్ సిబ్బంది ఆరోపించారు. విధుల్లో ఉండే సిబ్బందికి కనీసం తాగునీరు, వినియోగానికి సరైన వాష్‌రూమ్స్, డ్రెస్సింగ్ రూమ్‌లు లేవని, ఆసుపత్రిలో సెక్యూరిటీ, శానిటేషన్ లోపాలు స్పష్టంగా కనిపిస్తున్నప్పటికీ, ఆ లోపాలకు కూడా తమనే బాధ్యులను చేస్తూ అధికారులు వేధిస్తున్నారని తెలిపారు.​"గడిచిన నాలుగేళ్లుగా ఆసుపత్రి యాజమాన్యం తీరును, వేధింపులను భరిస్తున్నాం. బాధ్యతలన్నీ మాపైనే వేసి, హక్కులను కాలరాస్తున్నారు. ఇక భరించలేకే రోడ్డుపైకి వచ్చామని నర్సింగ్ సిబ్బంది తెలిపారు. 

అధికారుల నిర్లక్ష్యంపై ప్రజల విమర్శలు...

మరొకవైపు జిల్లా వైద్యారోగ్య శాఖ (డీఎంహెచ్ఓ) తీరుపై కూడా స్థానిక ప్రజల నుంచి విమర్శలు వ్యక్తమవుతున్నాయి. గత కొన్ని రోజులుగా ప్రైవేట్ ఆసుపత్రుల తపనిఖీలపైనే దృష్టి సారించిన అధికారులు, జిల్లా కేంద్రంలోని ప్రధాన ప్రభుత్వ ఆసుపత్రిలో నెలకొన్న సమస్యలను, అంతర్గత కలహాలను పట్టించుకోవడంలో విఫలమయ్యారని ప్రజలు విమర్శిస్తున్నారు.

సమగ్ర విచారణకు డిమాండ్...

నర్సింగ్ సిబ్బంది చేపట్టిన ఆందోళనతో జీజీహెచ్‌లో సేవలందించే ప్రక్రియకు తీవ్ర విఘాతం కలిగింది. ఉన్నతాధికారులు తక్షణమే జోక్యం చేసుకుని, డిప్యూటీ సూపరింటెండెంట్‌పై వచ్చిన ఆరోపణలపై పారదర్శకంగా సమగ్ర విచారణ జరిపించాలని డిమాండ్ చేస్తున్నారు. ఆసుపత్రిలో మెరుగైన పని వాతావరణాన్ని కల్పించి, మౌలిక వసతులు సమకూర్చాలని సిబ్బంది విజ్ఞప్తి చేస్తున్నారు.

Sthanikam

నల్గొండ జీజీహెచ్ లో ఉద్రిక్తత నర్సింగ్ ఆఫీసర్ల ఆందోళన

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News