Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు వన మహోత్సవం కార్యక్రమంలో భాగంగా అధికారులారా.. మాదాహార్తిని తీర్చండి జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా మట్టి వాసనలో మన సంస్కృతి.. జానపద కళల్లో తరతరాల జీవన గాథ హెచ్ఆర్పీఎం సంస్థ ఉమెన్ సెల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా :- పండ్ల లక్ష్మీదేవి న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 25, 2026 08:46 PM

పర్యావరణ పరిరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత

పర్యావరణ పరిరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత

పర్యావరణ పరిరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత
25-08-2026 0 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Biksham

మానవ జీవన విధానానికి మొక్కలే కీలకం

జిల్లా కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్, ఎస్పీ కె. నరసింహ

పర్యావరణ పరిరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత అని జిల్లా కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్ అన్నారు. పచ్చదనం పెంపొందించేందుకు ప్రజలు భాగస్వాములు కావాలని జిల్లా ఎస్పీ కె. నరసింహ పిలుపునిచ్చారు. మంగళవారం మోతే మండలం రాంపురం తండాలో జిల్లా గ్రామీణ అభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో నిర్వహించిన వనమహోత్సవంలో కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్, ఎస్పీ కె. నరసింహ పాల్గొని మొక్కలు నాటారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ మొక్కలు నాటడమే కాకుండా వాటిని సంరక్షించడం కూడా ప్రతి ఒక్కరి బాధ్యత అన్నారు. పర్యావరణ సమతుల్యతకు మొక్కలు ఎంతో అవసరమని, వాటిని పెంచడం ద్వారా భావితరాలకు మేలు జరుగుతుందని పేర్కొన్నారు.

అనంతరం మామిళ్లగూడెం హైస్కూల్‌ను కలెక్టర్, ఎస్పీ సందర్శించారు. విద్యార్థులతో ముచ్చటించి వారి విద్యాభ్యాసం, పాఠశాలలో అందుతున్న సౌకర్యాలపై వివరాలు తెలుసుకున్నారు. విద్యార్థులకు నాణ్యమైన విద్యతో పాటు మెరుగైన మౌలిక వసతులు కల్పించేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. పాఠశాలలో మౌలిక వసతులు, విద్యార్థుల హాజరు శాతం, మధ్యాహ్న భోజనం తదితర అంశాలపై కలెక్టర్ ప్రధానోపాధ్యాయురాలు నళినిని అడిగి తెలుసుకున్నారు.

కార్యక్రమాల్లో రాంపురం సర్పంచ్ బానోతు సత్తెమ్మ, మండల ప్రత్యేక అధికారి శ్యాంసుందర్ రెడ్డి, తహసీల్దార్ వెంకన్న, ఎంపీడీవో సందీప్ కుమార్, ప్రధానోపాధ్యాయురాలు నళిని, ఎంపీవో వంశీకృష్ణ, జర్నలిస్టులు, గ్రామస్థులు పాల్గొన్నారు.

Sthanikam

పర్యావరణ పరిరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News