Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
డివైఎఫ్ఐ రాష్ట్ర మహాసభలకు సన్నద్ధం కావాలి ప్రజాపాలనకు ఆయువుపట్టు: 'సమాచార హక్కు చట్టం - 2005' సుదీర్ఘ ప్రస్థానం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 15, 2026 04:02 PM

డ్రగ్స్‌ కట్టడికి ప్రజల భాగస్వామ్యం తప్పనిసరి: డీసీపీ నారాయణరెడ్డి

25-08-2026 27 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

జనవరి నుంచి 8 వేల కిలోల గంజాయి సీజ్‌.. డ్రగ్స్‌పై ఉక్కుపాదం.

మహేశ్వరం: మాదకద్రవ్యాల మహమ్మారిని కేవలం పోలీసుల చర్యలతో అరికట్టలేమని, ప్రజల సమష్టి భాగస్వామ్యంతోనే డ్రగ్స్‌ ముప్పును సమర్థంగా కట్టడి చేయగలమని మహేశ్వరం జోన్‌ డీసీపీ కె. నారాయణరెడ్డి (ఐపీఎస్‌) అన్నారు. మాదకద్రవ్య రహిత భారత్‌ లక్ష్యంగా పీఐబీ–హైదరాబాద్‌ ఆధ్వర్యంలో మహేశ్వరంలో నిర్వహించిన ‘వార్త’ మీడియా వర్క్‌షాప్‌లో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు.

డ్రగ్స్‌ నివారణ చర్యలు కుటుంబం, విద్యాసంస్థలు, సమాజం నుంచే ప్రారంభం కావాలని డీసీపీ నారాయణరెడ్డి సూచించారు. తల్లిదండ్రులు, విద్యార్థులు, సహచరులు అప్రమత్తంగా ఉంటూ మాదకద్రవ్యాలకు సంబంధించిన సమాచారాన్ని సకాలంలో పోలీసులకు అందించాలన్నారు. యువతను డ్రగ్స్‌ బారినుంచి కాపాడటం శాంతిభద్రతల అంశమే కాకుండా వారి ఆరోగ్యం, నైపుణ్యాలు, భవిష్యత్తును కాపాడటానికి కీలకమని తెలిపారు.

‘నషా ముక్త్‌ భారత్‌ అభియాన్‌’ దేశవ్యాప్త ప్రజా ఉద్యమంగా మారుతోందని ఆయన పేర్కొన్నారు. మాదకద్రవ్యాల దుష్ప్రభావాలపై ప్రజలకు అవగాహన కల్పించడంలో మీడియా కీలక పాత్ర పోషించాలని కోరారు. కచ్చితమైన సమాచారాన్ని ప్రచారం చేయడంతో పాటు కౌన్సెలింగ్‌, పునరావాస సేవలపై ప్రజలకు అవగాహన కల్పించాలన్నారు.

8 వేల కిలోల గంజాయి సీజ్‌: ఈగల్‌ ఫోర్స్‌ ఎస్పీ

ఈగల్‌ ఫోర్స్‌ ఎస్పీ రావుల గిరిధర్‌ (ఐపీఎస్‌) మాట్లాడుతూ.. మాదకద్రవ్యాల వినియోగం వ్యక్తిగత, కుటుంబ సమస్యను దాటి తీవ్రమైన సామాజిక, శాంతిభద్రతల, జాతీయ భద్రతా సవాలుగా మారిందన్నారు. జనవరి నుంచి తెలంగాణలో దాదాపు 8 వేల కిలోల గంజాయిని ఈగల్‌ ఫోర్స్‌ సీజ్‌ చేసిందని వెల్లడించారు. 22 రకాల శిక్షణ కార్యక్రమాల ద్వారా 30 వేల మందికిపైగా పోలీసు సిబ్బంది, ఇతర శాఖల అధికారులకు శిక్షణ ఇచ్చినట్లు తెలిపారు.

డ్రగ్స్‌ కేసులపై వార్తలు రాసేటప్పుడు కచ్చితత్వం, సున్నితత్వం పాటించాలని మీడియా ప్రతినిధులకు సూచించారు. ముఖ్యంగా మైనర్ల గుర్తింపును గోప్యంగా ఉంచాలని, మాదకద్రవ్యాల బారినపడిన వారి వ్యక్తిగత వివరాలను అనవసరంగా వెల్లడించవద్దని కోరారు.

కార్యక్రమంలో పీఐబీ–హైదరాబాద్‌ జాయింట్‌ డైరెక్టర్‌ డాక్టర్‌ మానస్‌ కృష్ణకాంత్‌, మహేశ్వరం ఎంపీడీవో ఎన్‌. శారదమ్మ, పీఐబీ మీడియా–కమ్యూనికేషన్‌ అధికారి వర్గంటి గాయత్రి తదితరులు పాల్గొన్నారు. సుమారు 60 మంది మీడియా ప్రతినిధులు హాజరయ్యారు.

Sthanikam

డ్రగ్స్‌ కట్టడికి ప్రజల భాగస్వామ్యం తప్పనిసరి: డీసీపీ నారాయణరెడ్డి

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News