Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
గ్రాడ్యుయేట్ ఓటు నమోదు దరఖాస్తులు సమర్పించిన భరత్ బాబు ప్రజాపాలనకు ఆయువుపట్టు: 'సమాచార హక్కు చట్టం - 2005' సుదీర్ఘ ప్రస్థానం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 15, 2026 10:39 AM

జాతీయ స్థాయి తైక్వాండో పోటీల్లో సత్తా చాటిన పుట్టపర్తి విద్యార్థులు

25-08-2026 44 Views
Reporter
స్థానికం ప్రతినిధి : శ్రీ సత్యసాయి జిల్లా ఇంచార్జ్
Anjali

ఈ నెల 23న నిర్వహించిన ఓపెన్ నేషనల్ తైక్వాండో ఛాంపియన్‌షిప్‌లో పుట్టపర్తికి చెందిన విద్యార్థులు అద్భుత ప్రతిభ కనబరిచి పలు పతకాలు సాధించారు. స్థానిక SSS స్కూల్‌లో శిక్షణ పొందుతున్న విద్యార్థులు జాతీయ స్థాయిలో తమ సత్తా చాటారు.

U-21 కేజీ విభాగంలో తేజేష్, జయాన్స్ గోల్డ్ మెడల్స్ సాధించగా.. హవిష్ కృష్ణ సిల్వర్, పార్థు బ్రాంజ్ మెడల్ సాధించారు.

U-28 కేజీ విభాగంలో పృథ్వి, ముకేశ్ కుమార్ రెడ్డి గోల్డ్ మెడల్స్, లోహిత్ సిల్వర్ మెడల్ సాధించారు.

35 కేజీల విభాగంలో సూర్య గోల్డ్ మెడల్, అలేఖ్య సిల్వర్ మెడల్ సాధించగా.. 75 కేజీల విభాగంలో వేదవర్ధన్ రెడ్డి బ్రాంజ్ మెడల్ కైవసం చేసుకున్నారు.

విద్యార్థులు జాతీయ స్థాయిలో ప్రతిభ కనబరిచి పతకాలు సాధించడంపై సత్యసాయి జిల్లా ఎస్పీ శ్రీ ఎస్. సతీష్ కుమార్ ప్రత్యేకంగా అభినందనలు తెలిపారు. మాస్టర్ దినేష్‌ను కూడా అభినందిస్తూ విద్యార్థులను మరింత ప్రోత్సహించాలని ఆకాంక్షించారు.

ఈ సందర్భంగా మాస్టర్ దినేష్ మాట్లాడుతూ.. ప్రతి విద్యార్థికి ఆత్మరక్షణ విద్య ఎంతో అవసరమన్నారు. తైక్వాండో, మార్షల్ ఆర్ట్స్ శిక్షణ ద్వారా విద్యార్థుల్లో క్రమశిక్షణ, ధైర్యం, ఆత్మవిశ్వాసం పెరుగుతాయని తెలిపారు. జాతీయ స్థాయిలో పతకాలు సాధించిన విద్యార్థులకు అభినందనలు తెలుపుతూ భవిష్యత్తులో మరిన్ని విజయాలు సాధించాలని ఆకాంక్షించారు.

విద్యార్థుల ఘన విజయం పుట్టపర్తికి గర్వకారణంగా నిలిచిందని తల్లిదండ్రులు, క్రీడాభిమానులు అభినందనలు తెలిపారు.

Sthanikam

జాతీయ స్థాయి తైక్వాండో పోటీల్లో సత్తా చాటిన పుట్టపర్తి విద్యార్థులు

Article Image

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News