Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
డివైఎఫ్ఐ రాష్ట్ర మహాసభలకు సన్నద్ధం కావాలి ప్రజాపాలనకు ఆయువుపట్టు: 'సమాచార హక్కు చట్టం - 2005' సుదీర్ఘ ప్రస్థానం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 15, 2026 05:07 PM

నేరాల నియంత్రణకు నిఘా నేత్రాలు.నాగోల్‌లో 74 సీసీటీవీ కెమెరాల ప్రారంభం.

25-08-2026 35 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

నాగోల్‌: నేరాల నియంత్రణ, ప్రజల భద్రతకు సీసీటీవీ కెమెరాలు కీలకమని ఎల్‌బీనగర్‌ ట్రాఫిక్‌ డీసీపీ బి. శ్రీనివాసులు అన్నారు. ‘నేను సైతం 2.0’లో భాగంగా నాగోల్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో ఏర్పాటు చేసిన 74 సీసీటీవీ కెమెరాలను బుధవారం ఆయన ప్రారంభించారు. నాగోల్‌ ఇన్‌స్పెక్టర్‌ మహమ్మద్‌ మక్బూల్‌ జానీతో కలిసి కెమెరాలను ప్రారంభించారు.

కృషినగర్‌లోని పల్లవి డీబీఆర్‌ అపార్ట్‌మెంట్స్‌లో 30, రాఘవేంద్రనగర్‌ కాలనీ, తట్టి అన్నారం డబుల్‌ బెడ్‌రూమ్‌, అన్నవరపు సత్యనారాయణ కాలనీల్లో మరో 44 కెమెరాలను ఏర్పాటు చేశారు. ప్రజల భాగస్వామ్యంతో ఏర్పాటు చేసిన ఈ కెమెరాలు నేరాల నియంత్రణతోపాటు నిందితుల గుర్తింపు, శాంతిభద్రతల పరిరక్షణకు ఉపయోగపడతాయని డీసీపీ తెలిపారు.

2.58 లక్షల కెమెరాలు..

మల్కాజిగిరి పోలీస్‌ కమిషనరేట్‌ పరిధిలో ‘నేను సైతం 2.0’ ద్వారా ఇప్పటివరకు 2,58,457 సీసీటీవీ కెమెరాలు ఏర్పాటు చేసినట్లు డీసీపీ తెలిపారు. ఎల్‌బీనగర్‌ జోన్‌లో 81,183 కెమెరాలు ఏర్పాటు చేయగా.. 104 మంది ప్రజలు ఈ కార్యక్రమంలో భాగస్వాములయ్యారని పేర్కొన్నారు. సైబర్‌ నేరాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, ట్రాఫిక్‌ నిబంధనలు పాటించాలని సూచించారు.

కార్యక్రమంలో ఎల్‌బీనగర్‌ ట్రాఫిక్‌ ఏసీపీ బి. నవీన్‌రెడ్డి, ఎస్‌ఐలు పి. శివనాగ ప్రసాద్‌, ఉమ, కాలనీ ప్రతినిధులు, అపార్ట్‌మెంట్‌ వాసులు పాల్గొన్నారు.

Sthanikam

నేరాల నియంత్రణకు నిఘా నేత్రాలు.నాగోల్‌లో 74 సీసీటీవీ కెమెరాల ప్రారంభం.

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News