Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
అర్హులందరికీ సంక్షేమ పథకాల ఫలాలు అందించాలి. మార్కెట్‌ కమిటీ చైర్‌పర్సన్‌ రేఖ బాబురావు. ప్రజాపాలనకు ఆయువుపట్టు: 'సమాచార హక్కు చట్టం - 2005' సుదీర్ఘ ప్రస్థానం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 15, 2026 12:25 PM

రుణాలను సద్వినియోగం చేసుకుని ఆదాయం పెంచుకోవాలి

24-08-2026 52 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Krishna

నారాయణఖేడ్ నియోజకవర్గంలో మానూర్ మండలం మాయికోడ్ గ్రామ పంచాయతీ కార్యాలయంలో స్వయం సహాయక సంఘాల సభ్యులకు శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా పాలమూరు మండల సమాఖ్య సీఆర్పీ ట్రైనర్లు స్వప్న, జమ్బేశ్వర్ మాట్లాడుతూ మహిళలు క్రమం తప్పకుండా పొదుపు చేస్తూ ఆర్థికంగా స్వావలంబన సాధించాలని సూచించారు. స్వయం సహాయక సంఘాల నిర్వహణ, బ్యాంకు రుణాలను సక్రమంగా వినియోగించుకోవడం, రుణాలతో ఆదాయం పెంచుకునే ఉపాధి అవకాశాలను ఎంచుకోవడం వంటి అంశాలపై మహిళలకు అవగాహన కల్పించారు. మహిళా సంఘాలు పేదరిక నిర్మూలనతో పాటు కుటుంబాల ఆర్థిక అభివృద్ధికి ఎంతో కీలకమని తెలిపారు. మహిళలు ఆర్థికంగా బలపడితే కుటుంబాలతో పాటు గ్రామాలు కూడా మరింత అభివృద్ధి చెందుతాయని పేర్కొన్నారు.కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన గ్రామ సర్పంచ్ కృష్ణ మాట్లాడుతూ గ్రామ మహిళల అభివృద్ధికి తనవంతు సహకారం అందించేందుకు ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటానని తెలిపారు. మహిళా సంఘాల సభ్యులు ప్రభుత్వం, సంఘాల ద్వారా అందుతున్న అవకాశాలను సద్వినియోగం చేసుకుని ఆర్థికంగా ఎదగాలని కోరారు.ఈ కార్యక్రమంలో గ్రామ పంచాయతీ కార్యదర్శి, ఉపసర్పంచ్, వార్డు సభ్యులు, సీసీ సాయిలు, వీఓఏ రజిని, మహిళా సంఘాల సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

Sthanikam

రుణాలను సద్వినియోగం చేసుకుని ఆదాయం పెంచుకోవాలి

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News